Share News

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మాత్రమే..

ABN , Publish Date - Jan 01 , 2025 | 08:03 AM

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌(Royal Enfield bike)లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 46 లక్షల విలువైన 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మాత్రమే..

- ఆ బైక్‌లే లక్ష్యంగా చోరీలు

- ఇద్దరు నిందితుల అరెస్ట్‌.. పరారీలో మరొకరు

- రూ.46 లక్షల విలువైన 30 వాహనాలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌(Royal Enfield bike)లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 46 లక్షల విలువైన 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇల్లాలి ఉసురు తీసిన ఇంటి గొడవ..


గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ షేక్‌ ఏసీ టెక్నీషియన్‌. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌, మరో ఇమ్రాన్‌ ఇద్దరూ ఆటో డ్రైవర్లు. ముగ్గురూ స్నేహితులు. బైక్‌లు చోరీ చేసి వాటిని ఇతర ప్రాంతాల్లో విక్రయించి జల్సా చేయాలని నిర్ణయించారు. ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ తాళం చెవిలతో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు.


రూ. 10 వేలకే..

చోరీ చేసిన బైక్‌లను ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట్‌(Mahabubnagar District Narayanpet) జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలించి తెలిసిన వారి సహకారంతో విక్రయించేవారు. రూ. 60-80 వేలు ధర చెప్పి అడ్వాన్స్‌గా రూ. 10 వేలు తీసుకొని బైక్‌ ఇచ్చేస్తారు. వాహన పత్రాలు ఇచ్చిన తర్వాత మిగతా డబ్బు తీసుకుంటామని వెళ్లిపోతారు. తర్వాత పత్రాలు ఇవ్వరు.. మిగిలిన డబ్బు అడగరు. ఏడాది నుంచి మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో, వికారాబాద్‌, పరిగి, పటాన్‌చెరు(Patancheru)తో సహా మొత్తం 15 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 24 కేసుల్లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాలో వీరు ముగ్గురూ ఉన్నారు.

city4.jpg


ఇలా పట్టుబడ్డారు..

రెండు రోజుల క్రితం చైతన్యపురి పోలీసులు విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. రాచకొండ పరిధిలో ఆరు బైక్‌లను చోరీ చేసింది వారే అని తేలింది. ఇప్పటి వరకు 30 బైక్‌లను చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌-12, యా క్టివా-10, స్ల్పెండర్‌-3, యునికార్న్‌-2 తదితర వాహనాలున్నాయని సీపీ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 08:03 AM