Share News

Hyderabad: పాన్‌షాప్ మాటున గంజాయి చాక్లెట్ల విక్రయం..

ABN , Publish Date - Jan 10 , 2025 | 07:44 AM

పాన్‌షాప్(Pan Shop) మాటున గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 85 ప్యాకెట్లను సీజ్‌ చేశారు. ఒక్కో ప్యాకెట్లో 40 చాక్లెట్స్‌ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Hyderabad: పాన్‌షాప్ మాటున గంజాయి చాక్లెట్ల విక్రయం..

- 85 ప్యాకెట్ల పట్టివేత

- బిహార్‌ నుంచి నగరానికి అక్రమరవాణా

హైదరాబాద్‌ సిటీ: పాన్‌షాప్(Pan Shop) మాటున గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ యువకుడిని ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 85 ప్యాకెట్లను సీజ్‌ చేశారు. ఒక్కో ప్యాకెట్లో 40 చాక్లెట్స్‌ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే.. బిహార్‌ దర్భంగ(Bihar Darbhanga) ప్రాంతానికి చెందిన చున్‌చున్‌ ఉపేందర్‌ మండల్‌ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మేడ్చల్‌ పరిధి తూంకుంటలో పాన్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కుక్కల పడవేత


city3.2.jpg

బిహార్‌లో తక్కువ ధరకు దొరికే చిన్న గంజాయి చాక్లెట్స్‌ను అక్రమంగా నగరానికి తెచ్చి ఒక్కో చాక్లెట్‌ను రూ.10నుంచి రూ.20లకు విద్యార్థులకు, పోకిరీలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 85 ప్యాకెట్లలో ఉన్న 3,400 గంజాయి చాక్లెట్స్‌ను సీజ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 07:44 AM