Share News

Hyderabad: ఈ సిగరెట్ల విక్రయానికి వాట్సాప్‌ గ్రూప్‌..

ABN , Publish Date - Apr 22 , 2025 | 10:49 AM

హైదరాబాద్ నగరంలో మరో కొత్త దందాకు తెరలేపారు. నిషేధిత ఈ సిగరెట్లను విద్యార్థులకు విక్రయిస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. అయితే.. ఈ దందాను పసిగట్టిన పోలీసులు మొత్తం ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఇ:దుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఈ సిగరెట్ల విక్రయానికి వాట్సాప్‌ గ్రూప్‌..

- గ్రూపులో 500 మంది విద్యార్థులు.. అందులో 13 మంది మైనర్లు

- వాట్సప్‏లో ఆర్డర్‌, ఆన్‌లైన్‌లో పేమెంట్‌

- ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ

- అన్నదమ్ములు అరెస్ట్‌

- రూ.25 లక్షల విలువైన ఈ సిగరెట్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: విద్యార్థులే లక్ష్యంగా ఈ సిగరెట్ల విక్రయానికి ఓ వాట్సప్‌(Whatsapp) గ్రూపు క్రియేట్‌ చేశారు. అందులో ఏకంగా 500 మంది యాడ్‌ అయ్యారు. వారిలో మైనర్లు కూడా ఉన్నారు. ఈ దందాలో కీలక పాత్ర పోషిస్తున్న అన్నదమ్ములను టీజీ న్యాబ్‌, పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం నాంపల్లి హజ్‌హౌస్‌ శక్తిసాయి కాంప్లెక్స్‌లో నివసిస్తున్న అనిల్‌ లలాని, సాదిక్‌ లలానీ సోదరులు. వీరు నిషేధిత ఈ సిగరెట్లను విద్యార్థులకు విక్రయిస్తున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ఎక్కువగా ఈ సిగరెట్‌లు వినియోగిస్తున్నట్లు గుర్తించిన టీజీన్యాబ్‌ అధికారులు స్కూళ్లు, కళాశాలల వద్ద నిఘా పెట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: మరో 16 ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..


సాదిక్‌ లలాని, అనిల్‌ లలాని విద్యార్థులకు ఈ సిగరెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి ఇంటిపై దాడి చేసిన అధికారులు ఇంట్లో నిల్వ ఉంచిన రూ. 25 లక్షల విలువైన ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాట్స్‌పలో ఆర్డర్‌ తీసుకొని ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తే, ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు, కొరియర్‌ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. తదుపరి విచారణలో మంబైకి చెందిన వసీం, ఢిల్లీకి చెందిన అమిత్‌ల వద్ద నుంచి ఈ సిగరెట్‌లు కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందతులపై కోప్టా యాక్ట్‌, పీఈసీ యాక్ట్‌, జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 77 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


హవాలా మార్గంలో చెల్లింపులు

ఈ సిగరెట్లు విక్రయిస్తున్న సోదరులు తాము పట్టుబడకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకునేవారు. ఈ సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు అనుమానం రాకుండా ఉండేందుకు రూ.50 వేల కన్నా తక్కువ మొత్తాలను బ్యాంకుల ద్వారా రూ. 50 వేలకు మించిన మొత్తాలను హవాలా మార్గంలో తరలించేవారు. హవాలా మార్గంలో డబ్బు తరలించేందుకు మంగీ రామ్‌జీ గౌతమ్‌, సీఆర్‌ శర్మల సహకారం తీసుకునేవారు. వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసిన అన్నదమ్ములు ఏపీ తెలంగాణలో రూ. కోటి విలువైన ఈ సిగరెట్లు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

city6.jpg


ఈ వార్తలు కూడా చదవండి

Gold Price Record: బంగారం లకారం

గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

నీట ఆటగాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2025 | 10:54 AM