Share News

Rangbhari Ekadashi 2025: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:44 PM

Rangbhari Ekadashi 2025: ఆది దంపతులు శివపార్వతుల అనుగ్రహం ఉంటే.. మనకు అన్ని ఉన్నట్లే. వారి నామ స్మరణ చేస్తే చాలు.. ఎవరికైనా ఇట్టే అనుగ్రహం కలుగుతోంది. అయితే ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశిని అమలిక ఏకాదశి అని అంటారు. ఆ రోజు అమ్మ, అయ్యవార్లను కొలుస్తే.. వారి అనుగ్రహం ఇట్టే కలుగుతోందని పెద్దలు చెబుతారు.

Rangbhari Ekadashi 2025: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి
Rangbhari Ekadashi

హిందూ సంప్రదాయంలో ఏడాదిలో వచ్చే అన్ని మాసాల్లో దశమి, ఏకాదశిలను శుభ ముహూర్తాలుగా పరిగణిస్తారు. విజయ దశమి, తొలి ఏకాదశి పర్వదినాలుగా ఉండనే ఉన్నాయి. ఇక ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష ఏకాదశిని రంగభరి ఏకాదశి పేరుతో ఉపవాసం పాటిస్తారు. దీనిని అమలిక ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువుతోపాటు ఉసిరి చెట్లను పూజిస్తారు. వారణాసిలో ఈ ఏకాదశిని రంగభరి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు శివపార్వతులను పూజిస్తారు. ఈ సందర్భంగా వారికి పలు ఆహార పదార్థాలను నైవేధ్యంగా భక్తులు సమర్పిస్తారు.


1. ఖీర్

రంగభరి ఏకాదశి.. శివపార్వతుల కలయికను సూచిస్తుంది. ఈ రోజున శివుడు.. తొలిసారిగా పార్వతిని కాశీకి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు ఆది దంపతులకు ఖీర్ సమర్పిస్తారు. ఎందుకంటే.. ఖీర్ ప్రేమ, మాధుర్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. అంతేకాదు ఇది శివపార్వతుల ప్రేమ, ఆశీర్వాదాలను ప్రతిబింబిస్తుంది. అలాంటి వేళ.. వారికి ఖీర్‌ సమర్పిస్తారు.


2. మల్పువా

ఇక ఈ రోజు.. శివ పార్వతులకు మల్పువా సమర్పించడం ద్వారా.. భక్తులు అన్ని రకాల ఆనందాలతోపాటు శ్రేయస్సును పొందగలుగుతారు. వీటితోపాటు పలు రకాల ఇబ్బందుల నుండి వారు ఉపశమనం పొందుతారు. యోగ్యుడైన వరుడిని పొందాలనలు కొనే యువతులు శివపార్వతులకు మల్పువా సమర్పించడం ఆచారమని పెద్దలు చెబుతారు.


3. తేనె

జ్యోతిష్య శాస్త్రంలో తేనెను తీయ్యదనానికి, ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. రంగభరి ఏకాదశి రోజు శివ, పార్వతికి తేనెను సమర్పించడం ద్వారా.. వైవాహిక జీవితంలో మాధుర్యంతోపాటు పరస్పర ప్రేమను సైతం పొందుతారు. అలాగే తేనె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా కూడా పని చేస్తుంది. ఈ ఏకాదశికి తేనె సమర్పించడం వల్ల శివ పార్వతులను సంతోషపరుస్తుంది. అంతేకాదు.. భక్తులు మంచి ఆరోగ్యంతోపాటు శ్రేయస్సు, ఆశీర్వాదం సైతం పొందుతారు.


4. తండై

ఈ ఏకాదశికి శివపార్వతులకు తండై సమర్పించాలి. తద్వారా వైవాహిక జీవితంలోని సమస్యలను పరిష్కరించవచ్చు. అంతేకాదు..శివపార్వతులకు తాండై అత్యంత ప్రీతిపాత్రమైందని చెబుతారు.

For Devotional News and Telugu News

Updated Date - Mar 10 , 2025 | 02:55 PM