Share News

Ugadi: ఉగాది నుంచి ఈ రాశుల వారికి సూపర్

ABN , Publish Date - Mar 28 , 2025 | 06:44 PM

Ugadi: మరికొద్ది రోజుల్లో ఉగాది పండగ రానుంది. ఆ పర్వదినం అనంతరం పలు రాశుల గ్రహ గతులు మారనున్నాయి. అయితే ఆయా రాశుల్లో కొంత మంది బాగా సంపాదించనున్నారు.

Ugadi: ఉగాది నుంచి ఈ రాశుల వారికి సూపర్

తెలుగు సంవత్సరాది ఉగాది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఈ పండగను మార్చి 30వ తేదీన జరుపుకోనున్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది నుంచి గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు.. మరికొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలు ఇవ్వనున్నాయి. అయితే ఉగాది అనంతరం మరి ముఖ్యంగా ఈ రాశుల వారిని అదృష్టం వరించనుంది. ఈ రాశుల వారికి సంపన్నయోగం పట్టపోతుంది.


మిధున రాశి వారికి ఉగాది తర్వాత సంపదలు అనుకొకుండా వచ్చి పడతాయి. ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది.సంతోషంగా జీవిస్తారు. మరి ముఖ్యంగా ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి.ఇది వీరికి శుభాలను చేకూర్చే సమయమని చెప్పవచ్చు.


వృషభరాశి వారు ఉగాది అనంతరం ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశి వారు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. అన్ని విధాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం మరింత మంచి ఫలితాలను పొందుతారు.


సింహరాశి వారు ఈ ఏడాది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ ఏడాది వారిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపే సమయమని చెప్ప వచ్చు. ఈ ఏడాదిలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వారిని వారు స్వీయ ఆవిష్కృతం చేసుకొని ముందుకు దూసుకు వెళ్తారు.


తులారాశి వారు.. ఈ సమయంలో ఊహించని అదృష్టాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.మీరు ఏం చేసినా విజయం తప్పక సిద్దిస్తోంది.


ధనస్సు రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని ఇస్తుంది. మీరు ఏ పని చేసినా మంచే జరుగుతుంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్థికంగా ఈ రాశి జాతకులకు మంచి సమయమని చెప్పవచ్చు.


మీన రాశి వారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది. గతంలో మీరు కన్న కలలు తప్పక నెరవేరనున్నాయి. ఆధ్యాత్మికంగాను ఈ రాశి వారికి ఈ సమయంలో ఎదుగుదల బాగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

LRS Number: ఎల్ఆర్ఎస్ నంబర్ మరిచిపోయారా..

Nirmala Sitaraman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

Updated Date - Mar 28 , 2025 | 07:06 PM