Share News

Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకర దర్శనం ఎప్పుడంటే..

ABN , Publish Date - Jan 13 , 2025 | 08:28 AM

శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తుంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.

Sabarimala: శబరిమలకు పోటెత్తిన భక్తులు.. మకర దర్శనం ఎప్పుడంటే..
Sabarimala

అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల (Sabarimala)కు పోటెత్తారు. మకర జ్యోతి దర్శనం కోసం వేల మంది భక్తులు (Ayyappa Devotees) శబరిమలకు చేరుకున్నారు. శబరిమలలో మకర జ్యోతి (Makara Jyothy) దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తుంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముందుగానే అయ్యప్ప భక్తులు కొండకు చేరుకున్నారు.


లక్షలాది మంది భక్తులు ముందుగానే శబరిమలకు చేరుకోవడంతో కొండ మొత్తం భక్తులతో నిండిపోయింది. రద్దీ భారీగా పెరిగిపోయి పంబ నది వరకు భక్తుల క్యూలైన్లు చేరుకున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. రద్దీ దృష్ట్యా గత రెండు రోజులుగా కేవలం 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనం టోకెన్లు ఇస్తున్నారట. అలాగే ఆన్‌లైన్ దర్శనాలను కూడా కుదించబోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ రోజు (13) 50 వేల మందికి, రేపు (14)న 40 వేల మందికి, 15న 60 వేల మందికి మాత్రమే ఆన్‌లైన్ దర్శనం కల్పించబోతున్నారట. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ట్రావెన్‌కోర్ సంస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 13 , 2025 | 10:15 AM