Home » ayyappa swamy devotees
శబరిమల ఆలయంలో పూజించే అయ్యప్ప స్వామి చిత్రం ఉన్న బంగారు లాకెట్ల పంపిణీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి తొలి గోల్డ్ లాకెట్ దక్కించుకున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ఆయనకు బంగారు లాకెట్‌ను అందజేశారు.
అయ్యప్ప భక్తులకు శుభవార్త..! ఇకపై ఇరుముడితో వెళ్లే భక్తులు పవిత్ర పద్దెనిమిది మెట్లు ఎక్కగానే.. అయ్యప్ప సన్నిధిలో దర్శనానికి అనుమతిస్తారు. ఇంతకు ముందు పదునెట్టాంబడి ఎక్కగానే.. భక్తులను ఎడమవైపునకు మళ్లించేవారు.
శబరిమలలో అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి స్వరూపుడై భక్తులకు కనువిందు చేశాడు. మకర జ్యోతిని దర్శించుకున్న భక్తులు.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
మకర సంక్రమణ సమయంలో.. కాంతమలైగా పిలిచే పొన్నంబలమేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహర పుత్రుడు అయ్యప్పస్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు.
శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతో భక్తిగా వేచి చూస్తుంటారు. ప్రతి సంక్రాంతి పండుగ రోజు దర్శనమిచ్చే మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటారు. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది.
సంక్రాంతి రోజున మకరజ్యోతిని దర్శించుకునేందుకు కొండకు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో శబరిమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చిన కొందరు భక్తులు ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.
శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది.
శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది.
శబరిమలలో మొట్టమొదటి సారిగా.. పంపా బేస్ క్యాంప్ నుంచి సన్నిధానం వరకు ప్రతి అంగుళం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఎంతో రుచిగా ఉండే అయ్యప్ప స్వామి ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్. అయితే, దీనికి ప్రత్యేకించి ఈ రుచి రావడం వెనుక ఓ కారణం ఉంది...