Share News

CBSE: విద్యార్థులకు షాకింగ్ న్యూస్..ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు..

ABN , Publish Date - Mar 29 , 2025 | 08:27 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-26 కోసం 10, 12వ తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. దీంతోపాటు అనేక కీలక మార్పులను ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

CBSE: విద్యార్థులకు షాకింగ్ న్యూస్..ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు..
CBSE New Syllabus 2025-26

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు షాకిచ్చే మార్పులను ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు CBSE తెలిపింది. సామర్థ్య ఆధారిత ప్రశ్నలను పెంచడం, పునఃపరిశీలన ప్రక్రియను మెరుగుపరచడం వంటి ప్రధాన మార్పులను బోర్డు ప్రతిపాదించింది. దీంతోపాటు కొత్త సిలబస్‌లో బోర్డు పరీక్ష 2026 కోసం బోధనా కంటెంట్, అభ్యాస ఫలితాలు, సిలబస్‌పై పలు మార్గదర్శకాలను ప్రకటించింది.


పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు

CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరం నుంచి రెండుసార్లు జరుగుతాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో జరగనున్నాయి. కానీ CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిర్వహించబడతాయి. దీంతో పాటు, CBSE 12వ బోర్డు పరీక్షలు 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని, దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పరీక్షలకు హాజరవుతారని బోర్డు ప్రకటించింది.


ఉపాధ్యాయులకు మార్పులు

CBSE సిలబస్ ప్రకారం, ఉపాధ్యాయులు తమ బోధనా విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చేలా సూచనలు ఇచ్చారు. అనుభవపూర్వక అభ్యాసం, సామర్థ్య ఆధారిత అంచనా, విద్యార్థుల భావనాత్మక అవగాహన, అనువర్తనాన్ని పెంపొందించడానికి సమగ్ర విధానాలను” పాటించాలని CBSE కోరింది. ఇక ప్రాజెక్ట్ ఆధారిత బోధన, ప్రశ్న-జవాబు తరహా అభ్యాసం, సాంకేతికతను అర్థం చేసుకోవడం వంటి అంశాలపై ఉపాధ్యాయుల దృష్టి పెట్టాలని తెలిపింది.


గ్రేడింగ్ సిస్టమ్

CBSE 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 9 పాయింట్ల గ్రేడింగ్ విధానంలో మార్కుల పద్ధతి అలాగే ఉంటుంది. అయితే, 10వ తరగతి బోర్డు పరీక్షలో 80 మార్కులకు సంబంధించిన పరీక్ష మాత్రమే నిర్వహించబడుతుంది. దీనిలో 20 మార్కులు అంతర్గత మూల్యాంకనానికి ఉంటాయి.

ఉత్తీర్ణత మార్కుల మార్పు

ఒక విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే, సబ్జెక్టులలో మొత్తం 33 శాతం మార్కులు సాధించాలి. అంటే, సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, లేదా ఏదైనా భాషా పేపర్‌లో విఫలమైనా, ఆరో ఐచ్ఛిక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సబ్జెక్టు మార్కుల ద్వారా అర్హతను పొందవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్ (కోడ్ 165), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (కోడ్ 402), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కోడ్ 417) అనే మూడు సబ్జెక్టుల్లో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకోవచ్చు.


భాషా సబ్జెక్టులపై స్పష్టత

CBSE 10వ తరగతిలో ఇంగ్లీష్ లేదా హిందీ భాషలను అనివార్యంగా ఎంచుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులు 9వ లేదా 10వ తరగతిలో ఈ రెండు భాషలలో ఒక దానిని ఎంచుకోవాలి. ఈ మార్పులతో విద్యార్థులు తమ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా, ఆవిష్కరణాత్మకంగా, సృజనాత్మకంగా, సాంకేతికంగా కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

AC Safety Tips: అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి..పేలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..


Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక


Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..


Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 29 , 2025 | 08:38 PM