PMEGP Loan: పీఎంఈజీపీ లోన్‌కు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? పూర్తి వివరాలు మీకోసం..
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:50 AM
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే చాలా మందికి ఆయా పథకాలపై సరైన అవగాహన ఉండదు. అర్హత ఉన్నా సరే, అవగాహన లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పేద ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే చాలా మందికి ఆయా పథకాలపై సరైన అవగాహన ఉండదు. అర్హత ఉన్నా సరే, అవగాహన లేకపోవడం వల్ల అందివచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటారు. అలాంటి ముఖ్యమైన పథకాల్లో ఒకటి పీఎంఈజీపీ (Prime Minister's Employment Generation Programme). దేశంలో నిరుద్యోగ యువతకు సహాయం చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
పీఎంఈజీపీ పథకం ద్వారా 50 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. అంతేకాదు దీనిలో రాయితీ కూడా అందుబాటులో ఉంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అలాగే కనీసం ఎనిమిదో తరగతి వరకు అయినా చదువుకుని ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ లోన్ పొందిన తరువాత వడ్డీ 7 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. ఈ పథకం కోసం www.kviconline.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లై చేసుకోవడం ఎలా..
ముందుగా www.kviconline.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్‌పై క్లిక్ చేయాలి.
ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే ``కెవిఐసి``ను సెలెక్ట్ చేసుకోవాలి. పట్టణ ప్రాంత అభ్యర్థులైతే డిఐసిలో నమోదు చేయాలి.
https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్సైట్‌లోకి వెళ్లి మీ వివరాలను ఫామ్‌లో నింపి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకున్న తరువాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి.
వాటిని ఎంటర్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు సంబంధించి వివరాలను నమోదు చేయాలి.
అప్లై చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో మీకు స్పందన వస్తుంది. ఆ తరువాత మీ ప్రాజెక్టుకు సంబంధించి నెల రోజులు పాటు మీ వీలును బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ శిక్షణను అందిస్తారు.
శిక్షణ పూర్తి అయిన తర్వాత మొదటి వాయిదా లోన్ ఇస్తారు.
లోన్ మొత్తం వచ్చిన తర్వాత వరుసగా మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ ఉంటే కేంద్రం సబ్సిడీ కూడా అందిస్తుంది.
మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు కోసం క్లిక్ చేయండి..