Home » Government of India
ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
స్నాతకోత్సవాల సందర్భంగా విద్యార్థులు ధరించే దుస్తులను భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు సూచించింది.
భారత సైన్యం ఆయుధ సంపత్తిని పెంచేలా శక్తిమంతమైన, తేలికపాటి ఆర్టిలరీ గన్స్ కొనుగోలు దిశగా కీలక ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసి, తయారు చేసే తర్వాతి తరం ఆర్టిలరీ గన్స్ కొనుగోలు కోసం భారత సైన్యం టెండరు జారీ చేసింది.
సినిమాల్లో నటిస్తున్నందుకుగాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని, రక్షింపబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటకశాఖల సహాయమంత్రి సురేష్ గోపి తెలిపారు.
కేరళ అధికార వర్గాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. చరిత్రలో ఆసక్తికరమైన సందర్భం ఆసన్నమవుతోందని చెప్పుకొంటున్నారు.
నేరుగా నియామకాలు (లేటరల్ ఎంట్రీ) విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందేందుకు యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది.
విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావు లోకూర్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(29వ తేదీ) ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిత్యం ఆలస్యంగా ఆఫీసుకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు(Central Govt Employees) సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9.15లోపే బయోమెట్రిక్ అటెండెన్స్(Biometric Attendence) వేయాలని స్పష్టం చేసింది.
మరణించిన వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు, తరచూ పాన్ కార్డు వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తాజాగా ఒక కథనంలో వెల్లడించింది.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.