Share News

Broccoli : బ్రోకలీ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

ABN , Publish Date - Jan 07 , 2025 | 03:42 PM

చాలామందికి బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కూడా తెలియదు. అయితే, దీనిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవెంటో తెలుసుకుందాం..

Broccoli : బ్రోకలీ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Broccoli Benefits

Broccoli Health Benefits : బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, చాలా మందికి ఇదేంటో తెలియదు. బ్రోకలీ అనేది మంచి పోషకమైన ఆకుకూర. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం నుంచి బరువు తగ్గించడం వరకు ఎంతగానో సహాయపడుతుంది. బ్రోకలీలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని విటమిన్లు సి, కె, ఎ, పొటాషియం, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతాయి. అంతేకాకుండా చర్మం, ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జీర్ణక్రియను నియంత్రించడంలోనూ సహాయపడుతాయి.

దీర్ఘకాలిక వ్యాధులకు:

బ్రోకలిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో ఈ కూరగాయలోని ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనాలు ఎంతగానో సహాయపడతాయి.


కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడానికి..

బ్రోకలీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థలోని కొలెస్ట్రాల్‌ను బంధించి శరీరం నుంచి తొలగించడానికి ఉపయోగపడుతంది. రక్తంలో మొత్తం కొలెస్ట్రాల్ ‌ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బ్రోకలీలోని ఫైబర్ జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడానికి..

బ్రోకలీ బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. దీనిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది తినే కేలరీల సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 07 , 2025 | 04:45 PM