Share News

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..

ABN , Publish Date - Mar 02 , 2025 | 12:46 PM

సమ్మర్‌లో మండే ఎండ నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఎక్కువగా జ్యూసులు తీసుకుంటారు. అలాగే చాలా మంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడతారు. అయితే, ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా? తాగితే ఏమవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

SugarCane Juice: ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా.. తాగితే ఏమవుతుంది..
Sugar Cane

Sugar Cane Juice: చెరుకు రసంలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. కానీ, ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుందని కొంతమంది అంటారు. అయితే, ప్రతిరోజు చెరకు రసం తాగడం మంచిది కాదా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇతర తీపి పదార్థాలు, పండ్ల రసాల కంటే చెరుకు రసంలో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. అందువల్ల, డయాబెటిస్ ఉన్నవారు అప్పుడప్పుడు మాత్రమే చెరుకు రసం తాగడం మంచిది. లేదంటే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది.

చెరుకు రసం ప్రయోజనాలు

  • రోజూ చెరుకు రసం తాగడం వల్ల శరీర వేడి తగ్గి, శరీరం చల్లబడుతుంది.

  • చెరుకు రసంలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఇనుము ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

  • ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేసి వ్యర్థాలను తొలగించే గుణాన్ని కలిగి ఉంటుంది.

  • చెరుకు రసం కాలేయానికి చాలా మంచిది. కామెర్లు ఉన్నవారు కూడా దీన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది.

  • చెరుకు రసంలో ఇనుము అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనతను నివారించవచ్చు.

  • రోజూ కొద్ది మొత్తంలో చెరుకు రసం తాగడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.

    (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

    Also Read:

  • మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

  • ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

Updated Date - Mar 02 , 2025 | 12:46 PM