Skincare : అబ్బాయిలూ.. ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ మెరిసిపోతుంది.. ఎప్పటికీ యంగ్‌గా ఉంటారు..

ABN, Publish Date - Mar 20 , 2025 | 07:39 PM

Skincare Tips for men: అబ్బాయిల చర్మం అమ్మాయిల చర్మంలా సున్నితంగా, నాజూగ్గా ఉండకపోవచ్చు. అయినప్పటికీ చర్మ సంరక్షణ కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే కొన్ని సులువైన స్కిన్ కేర్ టిప్స్..

Skincare for men: అబ్బాయిల్లో చాలామంది చర్మసంరక్షణపై పెద్దగా దృష్టి పెట్టరు. కానీ, ప్రస్తుతం వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం మీ చర్మానికి తీవ్రంగా హాని కలిగించవచ్చు. మేమైనా అమ్మాయిలమా అని చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అందం సంగతి అటుంచితే ఎండలోని యూవీ రేస్ నేరుగా ముఖాన్ని తాకి లేని పోని చర్మ వ్యాధులు రావచ్చు. కాబట్టి, అప్పుడప్పుడైనా కింద చెప్పిన టిప్స్ ద్వారా మ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.


క్లెన్సింగ్:

ముందుగా సున్నితమైన క్లెన్సర్‌ వాడటం ప్రారంభించండి. క్లెన్సింగ్ మీ చర్మంపై ఉన్న మురికి, చెమట, అదనపు నూనెలను తొలగిస్తుంది. మూసుకుపోయిన రంధ్రాలు, చర్మంపై పగుళ్లను పోగొట్టి చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. మీ చర్మ రకానికి సరిపోయే సున్నితమైన ఫేస్ క్లెన్సర్‌ను ఉపయోగించండి. రోజుకు రెండుసార్లు దీంతో మీ ముఖాన్ని కడుక్కొండి. ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి ఇలా తప్పక క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.


ఎక్స్‌ఫోలియేటింగ్ లేదా స్క్రబ్బింగ్:

ఎక్స్‌ఫోలియేటింగ్ లేదా స్క్రబ్బింగ్ వల్ల చర్మం ఉపరితలంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది. నిస్తేజంగా మరిన చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది. వారానికి 2-3 సార్లు స్క్రబ్బింగ్ చేస్తే సహజంగానే ముఖం వెలిగిపోతుంది. నాణ్యమైన స్క్రబ్ వాడాలని గుర్తుంచుకోండి. అయితే, అతిగా స్క్రబ్బింగ్ చేస్తే మొదటికే మోసం రావచ్చు. చర్మం పై పొరలు తొలగిపోయి చికాకు, మంట, దురద సమస్యలు రావచ్చు.


మాయిశ్చరైజింగ్:

మాయిశ్చరైజింగ్ మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. పొడిబారటాన్ని నిరోధిస్తుంది. చర్మం త్వరగా ముడతలు పడటం, సాగటం లాంటి సమస్యలు పోతాయి. మీది జిడ్డు చర్మం అయితే ప్రతిరోజూ నూనెలు ఎక్కువగా ఉండని మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. పొడి చర్మం అయితే ఆయిలీ క్రీమ్ లేదా త్వరగా హైడ్రేట్ చేసే క్రీమ్ రాసుకోండి.


సన్‌స్క్రీన్:

సూర్యరశ్మి నుంచి హానికరమైన UV కిరణాల విడుదలవుతాయి. మరీ ముఖ్యంగా వేసవిలో ఇవి నేరుగా మీ ముఖాన్ని ప్రభావితం చేసి చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే సన్‌స్క్రీన్ వేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి ఉదయం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోండి. మీరు ఎక్కువసేపు బయట ఉంటే ప్రతి 2 గంటలకు వేసుకోవడం శ్రేయస్కరం.


మీరు ఏమి తింటున్నారు.. జీవనశైలి ఎలా ఉంది అనేది మీ చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. పుష్కలంగా నీరు తాగుతూ ఉండండి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. ప్రధానంగా ధూమపానం మానుకోవాలి. సరైన నిద్ర, క్రమం తప్పని వ్యాయామం చేయడం ద్వారా మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిత్యయవ్వనంగా, ఉత్సాహంగా కనిపిస్తారు.

Updated at - Mar 21 , 2025 | 01:42 PM