Share News

Health Tips: వీటిని నెయ్యిలో వేయించి తింటే ఆ రోగాలు మాయం..

ABN , Publish Date - Jan 14 , 2025 | 06:28 PM

నెయ్యిలో వేయించిన మెంతికూరను పాలలో కలిపి తీసుకుంటే పోషకాహారం పెరుగుతుంది. దీన్ని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అవెంటో తెలుసుకుందాం..

Health Tips: వీటిని నెయ్యిలో వేయించి తింటే ఆ రోగాలు మాయం..
Fenugreek Leaves

పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. పాలను ఎక్కువగా ఉదయం తీసుకుంటారు. అల్పాహారంతో పాటు పాలు తాగడం వల్ల రోజంతా మీ శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే, ఈ పాలలో నెయ్యిలో వేయించిన మెంతికూర కలిపి తీసుకుంటే పోషకాహారం మరింత పెరుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి.

మెంతికూరను నెయ్యిలో వేయించి పాలతో కలిపి తీసుకుంటే మలబద్ధకం తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది వాపును తగ్గించడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెంతికూరను నెయ్యి, పాలలో వేయించి ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గుతారు. ఉదయాన్నే వీటిని తీసుకోవడం వల్ల గంటల తరబడి పొట్ట నిండుగా ఉంటుంది కాబట్టి రోజంతా మీ ఆకలిని అదుపులో ఉంచుతుంది.


మెంతికూరలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ ని నియంత్రిస్తుంది. ఈ కాంబినేషన్ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది. మెంతికూర వల్ల చర్మం దృఢంగా ఉండి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. పాలు, మెంతికూరల కలయిక చర్మానికి పోషణనిచ్చి పొడిబారకుండా చేస్తుంది.

మెంతులు కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. నెయ్యిలో వేయించిన పెసరపప్పును పాలతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. మెంతులు ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల చర్మం, జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 14 , 2025 | 06:28 PM