Health Tips: అన్నం తిన్నాక ఈ పనులు చేస్తే ఆరోగ్యానికి హానికరం..
ABN , Publish Date - Jan 08 , 2025 | 06:34 PM
అన్నం తిన్న తర్వాత ఒక గంట వరకు ఈ పనులు అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రస్తుత కాలంలో అందరిదీ బిజీ లైఫ్. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం కూడా తీరిక లేకుండా కాలాన్ని గడిపేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఉన్నవారు ఒక రోబోలా తయారయ్యారు. ఈ క్రమంలోనే అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. అయితే, అవి అనారోగ్యానికి దారి తీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి ఆరోగ్యంపై చెడు ప్రభావం కలుగుతుందని అంటున్నారు. అయితే, చాలామంది భోజనం చేసిన వెంటనే కొన్ని చెయ్యకూడని పనులు చేస్తూ అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. ఎలాంటి పనులతో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారో ఈ కధనంలో తెలుసుకుందాం..
ఈ పనులు చేయకూడదు..
అన్నం తిన్న వెంటనే స్నానం చేయడం మంచిది కాదు. అయితే, చాలా మంది ఈ తప్పును చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదని, గ్యాస్, కడుపులో మంట వంటివి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతగా స్నానం చేయాలనుకుంటే అన్నం తిన్న ఓ గంట తర్వాత స్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
అన్నం తిన్న తర్వాత ఏ పండ్లను తినకూడదు. ఎందుకంటే, మనం తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం తీసుకుంటుంది. మీరు ఈలోపు పండ్లను తినడం వల్ల ఆ పోషకాల్ని కోల్పోతారు. కాబట్టి, అన్నం తిన్నాక పండ్లను తినకూడదు. ఒకవేళ పండ్లను తినాలనిపిస్తే అన్నం తిన్నా తర్వాత గంటకి తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోతారు. అయితే, అలా తిన్న వెంటనే నిద్రపోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే బరువు పెరుగుతారని అంటున్నారు.
తిన్న వెంటనే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.
టీ, కాఫీలు కూడా అన్నం తిన్న వెంటనే తాగడం ఆరోగ్యానికి హానికరం.
తిన్న వెంటనే కూర్చోకండి. కాసేపు అటూ ఇటూ మెల్లిగా నడిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)