Share News

Paneer: ఈ చిట్కాలతో కల్తీ పన్నీర్‌ను గుర్తించండి..

ABN , Publish Date - Jan 07 , 2025 | 07:23 PM

కల్తీ పన్నీర్‌ను సింథటిక్ పన్నీర్ అని అంటారు. మీరు మార్కెట్‌లో తీసుకునే పన్నీర్ కల్తీదా లేదా నిజమైనదా అనే విషయాన్ని ఈ చిట్కాలతో తెలుసుకోండి.

Paneer: ఈ చిట్కాలతో కల్తీ పన్నీర్‌ను గుర్తించండి..
Paneer

Paneer: కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్‌లో రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. తయారీదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తయారీ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. శాకాహారులు ఎక్కువగా తీసుకునే పన్నీర్ ను కూడా కల్తీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. నకిలీ పన్నీర్‌ను సింథటిక్ పన్నీర్ అని అంటారు. దీన్ని పాలతో కాకుండా వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు లాంటివి వాడి నిజమైన పన్నీరు లాగా తయారు చేస్తారు. చూడ్డానికి ఏ మాత్రం తేడా లేకుండా తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తారు.


కల్తీ పన్నీర్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో తీసుకునే పన్నీర్ కల్తీదా లేదా నిజమైనదా అనే విషయాన్ని ఈ చిట్కాలతో తెలుసుకుందాం..

ల్తీ పన్నీర్‌ను ఇలా గుర్తించండి?

మీ చేతుల మధ్య పన్నీర్‌ను పెట్టి నలిపి చూడండి. వేళ్లతో నలిపినప్పుడు సులభంగా పిండిలాగా అయిపోతే అది కల్తీ పన్నీర్ అని అర్థం. ఒకవేళ పన్నీర్ విరిగిపోకుండా గట్టిగా ఉంటే అది నిజమైనదని గుర్తించాలి. ఎందుకంటే కల్తీ లేని పన్నీర్‌ అంత సులభంగా విరిగిపోదు.

కల్తీ పన్నీర్ ను మరో మార్గంలో కూడా గుర్తించవచ్చు. పన్నీర్ ను నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. అది చల్లారాక దానిలో కందిపప్పు పొడి చేసి కాస్త కలపాలి. కాసేపటికి పన్నీర్ లేత ఎరుపు రంగులోకి మారినట్లయితే అది యూరియా, లేదా డిటర్జెంట్ తో కల్తీ చేశారని అర్థం. అందుకే, పన్నీర్ కొనేముందు దానిని చేత్తో నలిపి చూడాలి. లేదాంటే పన్నీర్ ను కొంచెం నోట్లో వేసుకుని రుచి చూసి కొనాలి.

వాస్తవానికి పనీర్‌ను పాలతో తయారు చేస్తారు. పాలను వెనిగర్ లేదా నిమ్మరసం సహాయంతో విరగ్గొట్టి పన్నీర్ ను తయారు చేస్తారు. అయితే, సింథటిక్ పన్నీర్ ను తయారుచేయడానికి వెజిటేబుల్ నూనె కొవ్వు, పిండి, రసాయనాలు వాడతారు. దీని ధర నిజమైన పన్నీర్ కన్నా సగం తక్కువ ఉండొచ్చు. కల్తీ పన్నీర్ తింటే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Updated Date - Jan 07 , 2025 | 07:26 PM