Cooking Oil: వంటనూనెను ఇలా ఉపయోగిస్తే మీ ప్రాణానికే ప్రమాదం..
ABN , Publish Date - Jan 05 , 2025 | 07:57 PM
వంటనూనెను పదేపదే వాడుతుండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిని వృథాగా పారేయకుండా ఇలా పలు సందర్భాల్లో చక్కగా వినియోగించుకోవచ్చు. అవెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
Used Cooking Oil: నూనె లేకుండా ఏ వంట చేయలేం. నూనెలో వండిన వంట ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే, వండేసిన తర్వాత అదే నూనెను తిరిగి వంటకు వాడితే అది ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వంటనూనెను పదేపదే వాడితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆ నూనెను వృథాగా పారేయకుండా దేనికి వినియోగించుకోవడం మంచిది అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
వంటనూనెను పదే పదే వేడి చేయడం వల్ల వేడి స్థాయి మరింత పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇది దాని పరిమాణాన్ని తగ్గించి, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొనేలా చేస్తుంది.
నష్టాలు:
వంటనూనెను ఎక్కువసేపు వేడి చేయడం వల్ల హానికరమైన కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిలో అక్రిలమైడ్ అనే విషరసాయనం క్యాన్సర్ సంకేతాలు కలిగించే ప్రమాదం కలిగిస్తుంది.
గుండె సమస్యలు:
వంటనూనెను ఎక్కువసేపు వేడి చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, ఇతర అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందికి రక్తపోటు పెరిగవచ్చు. అంతేకాకుండా, కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది.
అవయవాలపై ప్రభావం:
వాడిన వంటనూనె ఆక్సిడైజ్ అవ్వడం వల్ల ఫ్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. ఇవి శరీరంలోని అవయవాలకు హానికరం. మధుమేహం, జ్ఞాపకశక్తి తగ్గుదల వంటి సమస్యలు కలుగుతాయి.
వాడేసిన వంటనూనెను ఈ కొన్ని సందర్భాల్లో మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చు..
వాడిన నూనెను కట్టెలపై అగ్గిని రగిల్చేందుకు ఉపయోగపడుతుంది.
వాడిన నూనెను కిచన్ పాత్రలపై మురికి తొలగించేందుకు ఉపయోగించవచ్చు.
వాడిన వంటనూనెను సోప్ తయారీకి ఉపయోగించవచ్చు.
ఏదైనా పనిముట్లు తుప్పు పట్టకుండా ఉండేందుకు వంటనూనెను వినియోగించుకోవచ్చు.
కొన్నిసార్లు ఆర్ట్ ప్రాజెక్టులలోనూ వాడేసిన వంటనూనెను ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు.
(Note: ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)