Share News

Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది

ABN , Publish Date - Mar 19 , 2025 | 03:43 PM

Summer: వేసవి వచ్చిందంటే.. ఆనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం టిఫిన్‌గా వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతోందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది

వేసవి కాలం కంటే.. ముందే ఎండలు వచ్చేశాయి. ఎండలు సైతం మండిపోతున్నాయి. మార్చి మాసంలోనే ఈ విధంగా ఎండలు ఉంటే.. ఏప్రిల్, మే మాసాల్లో పరిస్థితి తలచుకుంటే ఓ విధమైన ఆందోళన కలుగుతోంది. అలాంటి వేళ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆహారాన్ని సైతం ఎంపిక చేసుకొని.. వాటిని తీసుకోవాల్సి ఉంది. అది కూడా తెలిక జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వేసవి కాలంలో దాహం కూడా తీవ్రంగా ఉంటుంది. దీంతో నూనెతో తయారు చేసిన పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం మేలని వారు సూచిస్తున్నారు. వేసవిలో ఉదయం పూట టిఫిన్‌గా వీటిని తీసుకోమని వారు పేర్కొంటున్నారు.

ఇడ్లీ సాంబారు:

మినపపప్పుతో తయారు చేసే ఇడ్లీలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇక కంది పప్పుతో చేసిన సాంబార్ తీసుకోవాల్సి ఉంది. ఇందులో పలు రకాల కూరగాయాలతోపాటు కొత్తిమీర, కరివేపాకు వేస్తారు. ఇది శరీర ఆరోగ్యంతోపాటు జీర్ణక్రియకు సైతం దోహదపడుతోంది.


పెసరపప్పు..

పెసరపప్పుతో తయారు చేసిన అట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి త్వరగా జీర్ణమవుతోంది. వీటిలో కూరగాయలను తరిగి అట్లులో వేసుకోవడం వల్ల రుచికరంగా ఉండడమే కాకుండా.. ఆరోగ్యానికి సైతం మేలు చేస్తుంది.


రాగి జావా..

మానవ శరీరానికి అత్యంత మేలు చేసే ఆహారం ఏదైనా ఉందంటే.. అవి రాగులు మాత్రమే. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి సులభంగా జీర్ణం కావడమే కాకుండా.. పేగుల్లోని ఆహార పదార్థాల కదలికను సులుభతరం చేస్తుంది. అంతేకాదు.. వీటిలో ఫైబర్ శాతం అత్యధికంగా ఉంటుంది. అలాగే పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టిరీయాను సైతం పెరిగేలా చేస్తుంది. తద్వారా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది.


కూరగాయలతో చేసిన ఉప్మా..

బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా సైతం త్వరగా జీర్ణమవుతోంది. వీటిలో కూరగాయాలు.. క్యారెట్, బీన్స్, బఠానీలు వేిసి తయారు చేసుకోవడం వల్ల శరీరానికి బలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా.. ఇవి ప్రోబయోటిక్స్ అందిస్తాయి. ఇది పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా వృద్ధికి దోహదపడుతోంది.


పెరుగుతో అటుకులు..

త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్లో అటుకులు ఒకటి. ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయి. వీటిని పెరుగుతో కలిసి తీసుకున్నా.. శరీరానికి అత్యధిక పోషకాలను అందుతాయి. అటుకులు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల.. ఫైబర్ అందుతోంది. అలాగే కడుపు ఉబ్బరాన్ని సైతం నియంత్రిస్తోంది.

Read Also : Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న చిట్కాతో మీ ముఖం ఎంతలా మెరిసిపోతుందో నమ్మలేరు.

Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..

Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

Vitamin B12 Deficiency: పురుష ఉద్యోగుల్లో 57 శాతం మందికి ఈ సమస్య.. జాగ్రత్త

Updated Date - Mar 19 , 2025 | 03:47 PM