Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా.. మీ ఆయుష్షు..
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:58 PM
మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అలా అయితేనే బావుంటుంది.. ఎందుకంటే కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవిస్తారు.. ఎలా అంటే..
చాలా మంది కాఫీ తాగేందుకు ఇష్టపడతారు. కొంతమందికి ఇది లేకుండా డే కూడా స్టార్ కాదు. ఇంకొంత మంది కాఫీ లేకుండా బెడ్ పై నుండి కాలు కూడా కింద పెట్టరు. ఇంకొందరూ కాఫీ ఇష్టమని సమయం, సందర్భం లేకుండా తెగ తాగేస్తారు. మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉందా? అలా అయితేనే బావుంటుంది.. ఎందుకంటే కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవిస్తారని ఓ అధ్యయనంలో తేలింది.
రోజూ కాఫీ తీసుకోవడం వల్ల మన జీవితకాలం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తాజా, అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఉదయం కాఫీ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. రోజంతా కాఫీ తాగే వ్యక్తులు మరణ ప్రమాదాన్ని తగ్గిస్తారు.
ఉదయం కాఫీ తాగే వారి మరణాల రేటు మధ్యాహ్నం తాగే వారి కంటే తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. పరిశోధకులు 1999 - 2018 మధ్య 65 ఏళ్లు దాటిన 40,725 మందిని అధ్యయనం చేశారు. ఒక రోజులో ఏయే ఆహారాలు, పానీయాలను తీసుకున్నారు, అలాగే వారు తరచుగా ఎప్పుడు కాఫీని తాగారు అనే విషయాలపై డేటాను సేకరించారు. ఈ అధ్యయనంలో ఆరోగ్యవంతమైన వ్యక్తుల ఆయుష్షు 2050 నాటికి 16%కి పెరుగుతోందని తెలిపారు.
ఉదయం నిద్రలేచిన తర్వాత కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా మధ్యాహ్నం కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో కాఫీ తాగడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. కాఫీ దీర్ఘాయువుకు దోహదపడుతుందని.. అంతేకాకుండా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. మితమైన కాఫీ వినియోగం టైప్ 2 డయాబెటిస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)