Share News

Viral: నోటిలో మానని గాయం.. డెంటిస్ట్ వద్దకు వెళితే వెలుగులోకొచ్చిన షాకింగ్ అంశం

ABN , Publish Date - Jan 14 , 2025 | 11:35 PM

పన్ను తొలగించాక నోటి గాయం ఎంతకీ మానకపోవడంతో చెకప్‌కు వెళ్లిన రోగికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ప్రోస్టేట్ క్యాన్సర్ నోటికి కూడా వ్యాపించడంతో గాయం మానడంలో ఆలస్యం జరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు.

Viral: నోటిలో మానని గాయం.. డెంటిస్ట్ వద్దకు వెళితే వెలుగులోకొచ్చిన షాకింగ్ అంశం

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధుడికి దంత పరీక్షల సందర్భంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. ఈ ఉదంతం తాలూకు వివరాలు పలు మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే. సదరు వ్యక్తి ఇటీవల పన్ను కదులుతుండటంతో ఆసుపత్రికి వెళ్లారు. ఆయనను పరీక్షించిన వైద్యులు పన్ను తొలగించక తప్పదన సూచించాడు. రోగి ఇందుకు సమ్మతించడంతో పన్నును తొలగించారు. అయితే, రోగి ఇంటికెళ్లాడు. అయితే రోజులు గడుస్తున్నా పన్ను తొలగింపు ద్వారా అయిన గాయం మానలేదు. దీనికి తోడు అకస్మాత్తుగా దవడ మొత్తం వాచిపోయింది (Health).

Health: అతిగా నవ్వితే మరణం! కారణాలు ఇవే!

దీంతో, కంగారు పడిపోయిన వృద్ధుడు డెంటిస్టును సంప్రదించారు. సులువుగా మానాల్సిన గాయం ఎంతకీ తగ్గకపోవడం వైద్యుడిని కూడా ఆశ్చర్యపరిచింది. దీంతో, పేషెంట్‌కు సీటీ స్కాన్ సూచించారు. ఈ క్రమంలో వృద్ధుడికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. క్యాన్సర్ దవడకు వ్యాపించినట్టు వైద్యులు గుర్తించారు.


Health: రాత్రి పడుకునే ముందు రీల్స్ చూస్తారా? ఎంత ప్రమాదమో తెలిస్తే..

కాగా, ఈ ఉదంతంపై డాక్టర్లు స్పందించారు. క్యాన్సర్ బారిన పడట్టు అనేక సందర్భాల్లో డెంటల్ చెకప్‌ల్లోనూ తెలుస్తుందని వివరించారు. దవడ ఎముకకు రక్త సరఫరా అధికంగా ఉంటుందని, ఇక్కడి ఎముక మూలుగ క్రియాశీలకంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి, క్యా్న్సర్ కణాలు ఇక్కడ పోగుపడి కణుతులుగా మారే అవకాశాలు ఎక్కువని అన్నారు. క్యాన్సర్ దవడకు పాకడం అరుదైన విషయమే అయినా, క్యాన్సర్ అడ్వాన్స్‌డ్ దశకు చేరిందనేందుకు ఇది సంకేతమని తెలిపారు. అకారణంగా పంటి నొప్పి, నోటిలో వాపు వంటివి వేధిస్తున్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.


Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..

క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించగలిగితే చికిత్స తరువాత మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండటమే శ్రీరామ రక్ష అని అన్నారు. పురుషుల్లో అత్యధికంగా ప్రోస్టేట్ క్యాన్సర్ పడుతుంటారు. మూత్ర విసర్జనలో ఇబ్బందులు, రాత్రి పలుమార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటివన్నీ క్యాన్సర్‌ను సూచిస్తాయి. ఈ సమస్యలను ముందుగా గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితం ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..

Read Latest and Health News

Updated Date - Jan 14 , 2025 | 11:35 PM