Share News

Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..

ABN , Publish Date - Mar 27 , 2025 | 05:41 PM

Night Food: ప్రస్తుతం చాలా మంది ఉబకాయం, పొట్ట పెరుగుతుందంటూ ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆహార నియమాలను పాటిస్తున్నారు. అందులోభాగంగా రాత్రి పూట ఆహారం మానివేసి.. చపాతి తింటున్నారు. అయితే రాత్రుళ్లు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు.

Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..
Roti

చాలా మంది బరువు పెరుగుతున్నామని.. పొట్ట వస్తుందంటూ ఒక పూటే భోజనం తీసుకుంటారు. అంటే రాత్రి పూట చపాతి, లేకుంటే మరేదైన టిఫిన్ తీసుకుంటారు. అయితే రాత్రి భోజనం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ, నిద్రను పరిగణనలోకి తీసుకుంటే.. తీసుకునే ఆహారంలో రైస్, చపాతి సాధారణమైనవి. రాత్రి సమయంలో వీటి కంటే తేలికైన, ఆరోగ్య కరమైన ఆహారం అందుబాటులో ఉందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

రైస్, చపాతిలలో అధిక కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతోంది. చపాతి సైతం గోధుమ పిండితో తయారు చేసిన చపాతిని రాత్రి తీసుకున్నా.. బరువు పెరుగుతారు. అంతేకాదు.. అసిడిటీ, నిద్రలేమి తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులు రాత్రి తేలికైన ఆహారాన్ని సిఫారసు చేస్తున్నారు.


చపాతి కంటే జొన్న రొట్టె, రాగి రొట్టె వల్ల అధిక మేలు జరుగుతోందని చెబుతున్నారు. జొన్నలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువ, జీర్ణం సులభంగా జరుగుతోంది. రాగి రొట్టెలో కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది, రక్తహీనతను నియంత్రిస్తుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్వల్పంగా ఉంటుంది. దీంతో రాత్రి తినడానికి ఈ ఆహారం అనువైనది. ఈ రెండు ఆహార పదార్థాలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. కిలో జొన్న పిండి రూ. 40 నుంచి 50 ఉండగా.. రాగి పిండి రూ. 50 నుంచి 60 వరకు ఉంది. ఇక గోధుమ పిండి రూ. 45 వరకు ఉంది.


ఇంకా.. ఉడికించిన కూరగాయలు.. క్యారెట్, బీన్స్, బీట్‌రూట్‌తోపాటు ఓట్స్ ఉప్మా రాత్రికి అత్యంత ఆరోగ్యకరమైనది. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే తేలికగా జీర్ణమవుతుంది. కిలో ఓట్స్ రూ. 80 వరకు ఉంది. వీటి ధర సైతం సామాన్యలకు అందుబాటులో ఉంది. మొలకల సలాడ్ అంటే.. మొలకెత్తిన పెసర్లు, శనగలు సైతం తేలికగా జీర్ణమవుతుంది. ఇది కూడా పోషకాల గనీ.


రాత్రి పూట ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే నిద్ర సైతం గాఢంగా పడుతుంది. అదే విధంగా బరువు పెరగకుండా కాపాడతాయి. రాత్రిపూట తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి

Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్

Gynecologists: పిల్లలను కనడంలో ఆలస్యం వద్దు..

Updated Date - Mar 27 , 2025 | 05:42 PM