ఉల్లిపాయను ఇలా పెట్టుకుంటే ఆ సమస్యలు దూరం..
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:27 PM
ఉల్లిపాయ ఆహారానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు ఉల్లిపాయ తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Onion Uses: ఉల్లిపాయ.. ఇది లేకుండా ఏ వంట చేయలేం. ఉల్లిపాయ ఆహారానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు ఉల్లిపాయ తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉల్లిపాయలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, పొటాషియం, విటమిన్ సి వంటివి లభిస్తాయి.
వ్యాధుల ప్రమాదాన్ని..
ఉల్లిపాయ నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయను తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయలను అనేక రకాలుగా తినవచ్చు. దీర్ఘకాలిక దగ్గుతో బాధపడేవారు ఉల్లిపాయల రసాన్ని తీసుకుంటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఔషధ గుణాలు..
ఉల్లిపాయ ముక్కను పాదాల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని నిద్రిస్తే జలుబు, జ్వరం, దగ్గు నయమవుతాయి. దీర్ఘకాలిక పొడి దగ్గుకు కూడా ఇది చాలా మంచిది. పచ్చి ఉల్లిపాయను తింటే దగ్గు నుంచి ఉపశమనం లభించడమే కాకుండా ఛాతీలో కట్టిన కఫం కూడా తొలగిపోతుంది. ఉల్లిపాయ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయి.
జీర్ణ సమస్యలు..
ఉల్లిపాయలోని ఫైబర్ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టడాన్ని విచ్ఛిన్నం చేయడంతోపాటు గుండె జబ్బులను నిరోధిస్తుంది. జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే రోజుకో పచ్చి ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
(Note: ఈ కథనం ఆరోగ్య నిపుణుల సమాచారం మేరకు ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)