Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా? వెల్లుల్లిని దిండు కింద పెట్టుకోండి..
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:47 PM
మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా? పడుకునే ముందు మీ దిండు కింద 1-2 వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే, అలా పెట్టుకుని పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనివల్ల వారు అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ సమస్యతో బాధపడేవారు కూడా ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట తరచుగా మేల్కొనే వారు కూడా ఉన్నారు. అయితే, వెల్లుల్లి అటువంటి సమస్యలు ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే, పడుకునే ముందు మీ దిండు కింద 1-2 వెల్లుల్లి రెబ్బలు ఉంచండి, వెల్లుల్లి వాసన మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లిని అలా పెట్టుకుని పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
వ్యాధుల నివారణకు:
వెల్లుల్లి యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. దాని ఘాటైన వాసన మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారించడానికి మీ దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని నిద్రిపోతే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కీటకాల నివారణకు:
రాత్రిపూట దోమలు, పురుగుల బెడద ఎక్కువ. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుంటే దోమలు, పురుగులు ఉండవు. ఎందుకంటే దోమలు, పురుగులు వెల్లుల్లి వాసనను ఇష్టపడవు. తద్వారా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
చెడు కలలు రావు:
రాత్రిపూట దిండు కింద వెల్లుల్లిని పెట్టుకుని పడుకోవడం వల్ల చెడు కలలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే వెల్లుల్లికి నెగెటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఉందని చెబుతారు. ఇలా వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుంటే చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీని కారణంగా, మీరు చెడు కలలు, ఆందోళన లేదా భయం నుండి బయటపడతారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)