Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:38 PM
Milk: పాలు. పోషకాల గనీ. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. పిల్లల ఎదుగుదలలో పాలు కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే పాలు తాగే ముందు కానీ.. పాలు తాగిన తర్వాత కానీ.. ఈ ఆహార పదార్థాలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్? పాలు. వీటిలో అత్యధిక పోషకాలు ఉంటాయి. అయితే పాలు తాగే ముందు లేదా పాలు తాగిన తర్వాత.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. జీర్ణ సమస్యలతోపాటు ఆరోగ్య పరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవి ఏమిటో వారు సూచిస్తున్నారు..
ఆమ్ల గుణాలు కలిగిన పండ్లు: నిమ్మ, నారింజ, అనాస, ద్రాక్ష వంటి విటమిన్ సి కలిగిన పండ్ల తీసుకో కూడదు. ఇవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. వీటిని తిన్న తర్వాత పాలు తాగితే.. పొట్టలో అమ్ల స్థాయి పెరుగుతోంది. పాలలోని ప్రోటీన్ కరుగుతాయి. ఇది గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అంటే కడపు నొప్పికి గురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు తాగే ముందు ఈ పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు.
ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్న అనంతరం పాలు తాగితే సమస్యల వస్తాయని చెబుతున్నారు. చిప్స్, ఉప్పులో వేసిన గింజలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తదితర పదార్థాలు తీసుకున్న వెంటనే పాలు తాగితే.. శరీరంలో సోడియం సమతుల్యత దెబ్బతింటుంది. ఇది రక్తపోటు సమస్య ఉన్న వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బ తీస్తోంది.అయితే అధిక సోడియం తీసుకున్న వారు పాలు తాగినప్పుడు జీర్ణక్రియ మందగించినట్లు ఓ అధ్యయనంలో గుర్తించారు.
ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు.. మాంసం, చేపలు, ఆకు కూరలు తిన్న వెంటనే పాలు తాగకూడదు. పాలల్లోని కాల్షియం ఐరన్ శోషణను నియంత్రిస్తోంది. దీని వల్ల రక్తహీనత సమస్యలు ఉన్న వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. ఒక గర్భిణీ స్త్రీ చేపలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల ఆమె శరీరంలో ఐరన్ లోపం అధికమైనట్లు వైద్యులు గుర్తించారు.
కాఫీ లేదా టీ తాగిన వెంటనే పాలు తాగడం వల్ల సమస్యలు సైతం ఉత్పన్నమవుతాయి. కెఫీన్, పాలలోని పోషకాలను శోషించే ప్రక్రియను ఇవి ఆటంకపరుస్తాయి. అంటే కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తోంది.
ఇక పాలు తాగడానికి ముందు ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు,పోషకాల లోపం, ఆరోగ్య ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే..పాలు తాగే ముందు కనీసం 30 నుంచి 60 నిమిషాలు గ్యాప్ ఇవ్వడం మంచిది. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్ నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలను సరైన సమయంలో.. సరైన ఆహారంతో తీసుకోవడం శ్రేయస్కరమని వారు వివరిస్తున్నారు.