Bangladesh: షేక్ హసీనా అరెస్ట్‌కు మళ్లీ వారెంట్ జారీ
ABN , Publish Date - Jan 06 , 2025 | 06:02 PM
Sheikh Hasina: దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. అమెను అరెస్ట్ చేసేందుకు సహాయం చేయాలంటూ ఇంటర్ పోల్‌ను సైతం కోరింది.
ఢాకా, జనవరి 06: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో సారి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్‌లోని ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రెబ్యూనల్ (ఐసీటీ) సోమవారం ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆమెతోపాటు మరో12 మందిని అరెస్ట్ చేయాలంటూ ఐసీటీ జారీ చేసిన తన వారెంట్‌లో పేర్కొంది. ఫిబ్రవరి 12వ తేదీ లోపు వీరందరిని ట్రెబ్యూనల్ ఎదుట హజరు పరచాలని స్పష్టం చేసింది. దేశ ప్రధానిగా షేక్ హసీనా ఉన్న సమయంలో పలువురు వ్యక్తులు అదృశ్యం కావడమే కాకుండా.. చట్ట విరుద్దంగా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనాతోపాటు ఆమె ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పలువురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఆమెతో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ అయింది. హసీనా ప్రభుత్వంలో రక్షణ శాఖ సలహాదారుగా వ్యవహరించిన మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిఖ్ అహ్మద్ సిద్దిఖీ, మాజీ ఐజీ బేనజీర్ అహ్మద్‌తోపాటు నేషనల్ టెలి కమ్యూనికేషన్ మ్యానిటరింగ్ సెంటర్ మాజీ డైరెక్టర్ జనరల్ జియవుల్ హసన్‌లపై సైతం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
గతేడాది బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం ఆమె భారత్‌కు చేరుకుని.. ఇక్కడ ఆశ్రయం పొందుతోన్నారు. అయితే ఈ అంశంలో వీరిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అయితే షేక్ హసీనాతోపాటు ఆమె ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిపై మరోసారి కేసు నమోదయింది. దీంతో ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రబ్యూనల్ (ఐసీటీ) వరుసగా రెండోసారి వారిని అరెస్ట్ చేయాలంటూ ఈ వారెంట్ జారీ చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా అరెస్ట్‌కు సహాయం చేయాలంటూ ఇంటర్ పోల్‌ను సైతం బంగ్లాదేశ్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమెకు తమకు అప్పగించాలంటూ భారత్‌ను ఇప్పటికే బంగ్లాదేశ్ పలుమార్లు విజ్జప్తి చేసిన విషయం విధితమే.
Also Read: తురకా కిషోర్ సోదరులను జైలుకు తరలించిన పోలీసులు
Also Read: రెచ్చిపోయిన మావోయిస్టులు.. భారీ సంఖ్యలో జవాన్లు మృతి
Also Read: లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 32 మందికి గాయాలు
మరోవైపు గతేడాది అక్టోబర్‌లో షేక్ హసీనా అరెస్ట్‌కు ది ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రెబ్యూనల్ (ఐసీటీ) వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు మరో 45 మందిని అరెస్ట్ చేయాలంటూ ఆ వారెంట్‌లో స్పష్టం చేసింది. నవంబర్18వ తేదీలోగా వారిందరిని ట్రెబ్యూనల్ ముందు హాజరుపరచాలంటూ పేర్కొంది. అయితే ఆమె ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతోంది. గతేడాది జూలై, ఆగస్ట్ మాసాల మధ్య బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణలకు దేశవ్యాప్తంగా విద్యార్థులు పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సైతం దీనికి మద్దతు తెలిపారు. ఆ క్రమంలో చెలరేగిన హింసలో 600 మందికిపైగా మరణించారు.ఈ నేపథ్యంలో నాటి షేక్ హసీనా ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన వారిపై సైతం కేసులు నమోదయ్యాయి.
For International News And Telugu News