EU Bans Caffine : 27 దేశాల్లో కెఫీన్ వాడకం నిషేధం.. బాంబు పేల్చిన EU..
ABN , Publish Date - Mar 01 , 2025 | 08:00 PM
EU Says Caffine is Equal to Pesticides : మీరు కాఫీ ప్రియులా.. వీలు చిక్కినప్పుడల్లా కాఫీ సేవిస్తూ రిలాక్స్ అవుతుంటారా.. అయితే, ఈ విషయం గురించి ఓ సారి తప్పక ఆలోచించండి. ఎందుకంటే, కాఫీ పురుగుల మందుతో సమానమని యూరోపియన్ యూనియన్ (EU) బాంబు పేల్చింది. ఇంతేనా, ఇకపై ఈ హానికర పానీయాన్ని..

EU Says Caffine is Equal to Pesticides : రోజూ అదే పనిగా కాఫీ తాగుతున్నారా? ఆఫీసులో విరామం చిక్కినప్పుడల్లా కప్పులో కాఫీ పట్టుకుని ముచ్చట్లలో మునిగిపోతున్నారా? అయితే ఇది మీకో షాకింగ్ న్యూస్.. ఎందుకంటే, కెఫిన్ సేవించడం మానవులకు హానికరమని యూరోపియన్ యూనియన్(EU) ప్రకటించింది. ఇందులో కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటే పురుగులమందుతో సమానమని చెప్పడమే కాదు.. ఏకంగా రసాయన భద్రతా నిబంధనల కిందకి తీసుకొచ్చింది. 'కాఫీ మానవులకు హానికరం' అని చెప్తూ కూటమిలోని 27 దేశాల్లో కెఫీన్ వాడకాన్ని నిషేధించాలని హెచ్చరికలు జారీ చేసింది.
కాఫీ తాగడం హానికరమా..
కాఫీ రోజులో మోతాదుకు మించి తాగితే గుండె సంబంధిత సమస్యలు, డీహైడ్రేషన్, శరీర ఉష్ణోగ్రత పెరుగుదల వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట. అలాగే, ఇందులోని కెఫీన్ నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించడంతోపాటు నిద్రలేమి, ఆందోళన, మానసిక వ్యాధులను కూడా పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు అధిక కెఫిన్ తీసుకుంటే.. పుట్టబోయే బిడ్డ బరువు తక్కువగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక పిల్లలు.. కౌమారదశలో ఉన్న యువతలోనూ ఇది మానసిక, శారీరక మార్పులను తీసుకువస్తుందని భావిస్తున్నారు.
ఇవి కూడా మంచివి కావు..
ఇంకా ఎనర్జీ డ్రింక్స్ కూడా మంచివి కావు. ఎందుకంటే వాటిలో కేవలం కెఫిన్‌తో పాటు ఇతర ఉద్దీపన పదార్థాలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. అందుకే, భవిష్యత్తులో వాటి లేబులింగ్, ప్రకటనల మీద మరింత స్పష్టతతో గట్టి రూల్స్ రావచ్చు. నిజానికి ఎక్కువ కెఫీన్ తీసుకుంటే గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, ఒత్తిడి పెరగడం, ఆందోళన, మానసిక స్థిరత్వం తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపించొచ్చు. అయితే, మితంగా తీసుకుంటే దీని వల్ల కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. మెదడు సున్నితంగా పని చేయడం, అలర్ట్‌గా ఉండటం, టైప్ 2 డయాబెటిస్, పార్కిన్సన్ లాంటి వ్యాధుల రిస్క్ తగ్గడం వంటి కొన్ని ప్రయోజనాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల ప్రమాదాలే ఎక్కువని చెబుతున్నారు.
ఇక ఎనర్జీ డ్రింక్స్ మీద, కాఫీ మీద మరింత నియంత్రణలు వస్తాయా? ఎవరికి ఏ మోతాదులో తీసుకోవాలి? అన్న ప్రశ్నలు మరింత తీవ్రంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, మితంగా తీసుకోవడం, అసలు మన ఆరోగ్యానికి ఇది ఏ మేరకు సరిపోతుందో అర్థం చేసుకోవడం అత్యవసరమైంది. కాబట్టి, మీరు కాఫీ తాగేటప్పుడు, కప్పును చేతిలో పట్టుకున్నప్పుడైనా.. ఒక్కసారి ఆలోచించి ఎంత తాగాలో అంతే తాగండి.
Read Also : America Ukraine: ఓ సీక్రెట్ ఫోన్ కాల్... అమెరికా అధ్యక్షుడిని ఊహించని ముప్పులోకి నెట్టింది.. ఈ కథ విన్నారా?
Business Idea: తక్కువ పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. డిమాండ్ తగ్గని బిజినెస్..
India-World Bank: ఇలా చేస్తే ఇండియా నంబర్ 1.. ప్రపంచ బ్యాంకు ఏం చెప్పిందంటే..