Share News

China: ట్రంప్ సుంకాలు.. స్పందించిన చైనా

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:45 PM

China : ప్రపంచదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నాడు. అలాంటి వేళ.. చైనా తన సుంకాలను పెంచింది. దీంతో చైనా నుంచి దిగుమతయ్యే వాటిపై ట్రంప్ భారీగా సుంకాలను పెంచారు. అలాంటి వేళ.. అమెరికా ఎలా వ్యవహరించిన తాము మాత్రం తగ్గదేలే అంటుంది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టింది.

China: ట్రంప్ సుంకాలు.. స్పందించిన చైనా

బీజింగ్, ఏప్రిల్ 10: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశానికి దిగుమతయ్యే వివిధ దేశాల వస్తువులపై సుంకాలు మోత మోగిస్తున్నారు. ఆ క్రమంలో వివిధ దేశాల నుంచే కాకుండా.. స్వదేశంలోని అమెరికన్ల నుంచిసైతం ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక చైనాపై ఆమెరికా భారీగా సుంకాలు పెంచింది. ఈ సుంకాల పెంపుపై చైనా తనదైన శైలిలో స్పందించింది. చైనా దిగుమతులపై సుంకాలను 125 శాతానికి పెంచినటప్పటికీ.. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని డ్రాగన్ దేశం కుండ బద్దలు కొట్టింది. అమెరికా సుంకాలు.. మొత్తం ప్రపంచానికి వ్యతిరేకంగా వెళ్తున్నాయని హెచ్చరించింది. ఇది ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న వాణిజ్య యుద్దంగా అభివర్ణించింది.


గురువారం బీజింగ్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మాట్లాడుతూ పై విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ట్రంప్ నూతన పన్ను విధానం వల్ల వాణిజ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తినే అవకాశముందని అభిప్రాయపడ్డారు. స్థిరంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా జరుగుతోన్న కఠిన చర్య ఇదని పేర్కొన్నారు.


ఇక ఈ వ్యవహారంలో అమెరికాతో రాజీకి వెళ్లే ప్రసక్తే లేదని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యోంగ్కియన్ వెల్లడించారు. ఈ సుంకాల వ్యవహారంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఆపడానికి అమెరికా కలవాలన్నారు. ఒక వేళ రాజీ కుదరక పోతే మాత్రం.. తమ దేశం చివరి వరకు పోరాడతామని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఓ వేళ రాజీ జరిగితే మాత్రం ఇక ఇది పరస్పర గౌరవ ఆధారంగా ఉండాలని.. సమాన పద్దతిలో నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.


చైనాపై ట్రంప్ సుంకాలు..

పలు దేశాలపై తాను విధించిన భారీ సుంకాలను చాలా వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు కాస్తా ఊరట లభించినట్లయింది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, యుఎస్ దిగుమతులలో రెండవ అతిపెద్ద ప్రొవైడర్ చైనా.. ఈ విషయం అందరికి తెలిసిందే. అలాంటి చైనా దేశం.. అమెరికా నుంచి దిగుమతవుతున్న వస్తువులపై 84 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా దేశానికి సుంకాలను భారీగా పెంచారు. దానిని 125 శాతానికి పెంచారు. ఈ నేపథ్యంలో చైనా పై విధంగా స్పందించింది.


అయితే వాణిజ్యంపై చైనాతో ఒక తీర్మానం చేసుకునేందుకు సాధ్యమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆ క్రమంలో చైనా ఓ ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటోందన్నారు. కానీ దాని గురించి ఎలా ముందుకు సాగాలో వారికి తెలియదన్నారు. ఇక వియత్నాం, జపాన్, దక్షిణ కొరియాతోపాటు పలుదేశాలతో సంప్రదింపులు, చర్చలకు ప్రాధాన్యత ఇస్తామని ట్రంప్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Michelle Obama On Divorce: విడాకులు తీసుకోబోతున్న ఒబామా దంపతులు.. మిచెల్ ఏమన్నారంటే..

Funny Tomato Video: ఒక్క టమాటా ధర రూ.1300.. ఎలా పెంచారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

For International news and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 03:46 PM