Share News

China: చంద్రునిపైకి ఎగిరే రోబోట్‌ ప్రయోగం.. ఎందుకో తెలుసా..

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:29 PM

చంద్రునిపైకి మానవ రహిత ప్రయోగం చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చాంగే 7 మిషన్ ద్వారా ఫ్లయింగ్ డిటెక్టర్ వంటి రోబోను పంపించాలని చూస్తున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

China: చంద్రునిపైకి ఎగిరే రోబోట్‌ ప్రయోగం.. ఎందుకో తెలుసా..
China's Chang'e 7 Mission

చైనా (china) చంద్రుని పైకి దిగేందుకు మళ్లీ కొత్త ప్లాన్ వేస్తుంది. ఈ క్రమంలో చంద్రుని దక్షిణ ధ్రువంపై నీటి కోసం శోధించే స్మార్ట్ రోబోటిక్ "ఫ్లయింగ్ డిటెక్టర్"ను పంపాలని యోచిస్తోంది. ఈ ప్రయోగం ద్వారా వచ్చే ఐదేళ్లలో క్రమంగా మానవులను చంద్రునిపైకి దించాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలో చాంగే 7 మిషన్‌ (Chang'e 7 Mission) ద్వారా చంద్రుని ఉపరితలంపై అత్యంత వివరణాత్మక పరిశోధనలు చేయాలని చైనా అనుకుంటోంది. ఈ క్రమంలో ఎగిరే రోబోట్ పంపించాలని చూస్తున్నారు. ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, లూనార్ రోవర్, ఫ్లయింగ్ డిటెక్టర్లు ఉండబోతున్నాయి.


నీటి పరిశోధనకు..

ఈ మిషన్ ముఖ్య లక్ష్యం చంద్రుని దక్షిణ ధ్రువంలో ఉన్న మంచు ఉపరితలం పరిసరాలను విశ్లేషించడం. చంద్రునిపై నీరు ఘనీభవించిన రూపంలో ఉంటుంది. దీని ద్వారా మానవుల కోసం అవసరమైన నీటి పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ఎగిరే రోబోట్ చాలా స్మార్ట్ రోబోట్ అని చైనా చాంగే 7 మిషన్ డిప్యూటీ చీఫ్ డిజైనర్ టాంగ్ యుహువా అన్నారు. ఇది సాధారణంగా మానవులు చేసినట్లుగా గమనం చేస్తుందన్నారు. అంటే స్థిరంగా విభిన్న ఎత్తుల నుంచి దిగుతుందని, చంద్రముఖ ఉపరితలంపై నావిగేట్ చేయడానికి కాళ్ల ట్రాజెక్టరీ పద్ధతులు, జాయింట్ డ్రివెన్ వంటివి ఉంటాయన్నారు.


చాలా దూరం ప్రయాణం..

ఈ రోబోట్ రాకెట్ ప్రొపల్షన్ ఉపయోగించి చంద్రుని అంతరిక్షంలో ఎక్కడికైనా వెళ్లగలదు. దీనిని ఎక్కడానికి, క్రాల్ చేయడానికి, దూకడానికి, ఎగరడానికి అనుకూలంగా రూపొందించారు. అందువల్ల సాంప్రదాయంగా ఉన్న చక్రాల రోవర్‌ల కంటే మరింత క్లిష్టమైన భూ భాగాలను, గుంటలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ ఫ్లయింగ్ డిటెక్టర్ పరిమిత కాల్పనలతో కాకుండా, డజన్ల కొద్దీ కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు.


కావలసిన శక్తిని..

ఈ రోబోటిక్ డిటెక్టర్ చంద్రుని దక్షిణ ధ్రువంలోని నీటి నిల్వలను పరిశీలించడానికి మార్గం సుగమం చేయనుంది. డిటెక్టర్‌ను దాదాపు అన్ని రకాల మృదువైన లేదా కఠినమైన భూభాగాలను పరిశీలించడానికి ఉపయోగించేలా రూపొందించారు. ఈ రోబోటిక్ వ్యవస్థలో నాలుగు ఇంధన ట్యాంకులు, చిన్న థ్రస్టర్‌లు ఉన్న రింగ్ ఉన్నాయి.

వాతావరణంలో కూడా

దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పరికరం సౌరశక్తి ద్వారా పనిచేసేలా ఉంటుంది. తద్వారా దీనికి కావలసిన శక్తి అంతరిక్షంలోనే తీసుకోబడుతుంది. ఈ రోబోట్ రాకెట్ శక్తితో గాలి లేని వాతావరణంలో కూడా పని చేస్తుందని, ఇంధనం ఖర్చు అయిన తర్వాత, అది సౌర ప్యానెల్‌లను ఉపయోగించి అవసరమైన శక్తిని పొందుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో చాంగే సూర్యరశ్మిని ఎప్పటికప్పుడు అందుకుని ఆయా ప్రాంతాలను, మంచు కనిపించే స్థలాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.


ఇవి కూడా చదవండి:

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:32 PM