Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలపై.. కెనడా, మెక్సికో, చైనా రియాక్షన్..
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:23 AM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై దిగుమతి సుంకాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో, చైనాల నుంచి వచ్చే దిగుమతులపై భారీ సుంకాలను ప్రకటించగా, తాజాగా ఆయా దేశాల నేతలు ఘాటుగా స్పందించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించారు. శనివారం, ట్రంప్ అమెరికా, కెనడా, మెక్సికో, చైనాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలను విధించే ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ చర్యతో ఉత్తర అమెరికా పొరుగు దేశాల నుంచి కఠినమైన ప్రతిస్పందనలు వచ్చాయి. దీనికి కెనడా, మెక్సికో, చైనా వారి విధానాలకు విరుద్ధంగా స్పందించారు. ట్రంప్ ఆదేశాల ప్రకారం, చైనా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 10% సుంకాలు విధించాలని, అలాగే మెక్సికో, కెనడా నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలు విధించాలన్నారు.
కెనడా ప్రధాని ఏమన్నారంటే..
ఈ చర్యలకు రెస్పాన్స్ గా, కెనడా (Canada) ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, తమ దేశం అమెరికా నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాలు 155 బిలియన్ల డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై విధించబడతాయి. మొదట, 30 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులపై తక్షణమే సుంకాలు, ఆ తర్వాత 125 బిలియన్ల డాలర్ల విలువైన వస్తువులపై మరింత సుంకాలు విధించబడతాయని ప్రకటించారు. తద్వారా కెనడియన్ కంపెనీలు ప్రత్యామ్నాయాలను కనుగొనగలుగుతాయని ట్రూడో అన్నారు.
మెక్సికో కూడా
మరోవైపు మెక్సికో (Mexico) కూడా తమ రక్షణ చర్యలను ప్రకటించింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా తమ దేశం ప్రతిస్పందిస్తుందని వెల్లడించారు. అంతేకాదు డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపలతో తమకు సంబంధాలు ఉన్నాయన్న వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. మా ప్రభుత్వ సమయంలో గత నాలుగు నెలల్లో డ్రగ్స్ విషయంలో 10 వేల మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఇక చైనా విషయానికొస్తే..
అంతేకాదు చైనా (China) కూడా ఈ అంశంపై స్పందించింది. అమెరికా సుంకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అమెరికా తప్పుడు విధానాలు అనుసరిస్తోందని, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది.
ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై..
అమెరికా వాణిజ్య చర్యను ప్రస్తావిస్తూ ట్రంప్ దీనిని అమెరికా ప్రజల రక్షణ కోసం అవసరమని చెప్పారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం చూస్తే అక్రమ ఫెంటానిల్ తయారీ, ఎగుమతిని అరికట్టడానికి, కెనడా, మెక్సికో వలసల్ని నియంత్రించడానికీ ఈ చర్యలు అవసరమని చెప్పారు. ఇది ఆయన ఓటర్లకు ఇచ్చిన హామీలలో ఒకటిగా ఉంది. అయితే ఈ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. సుంకాలు పెరిగితే, ధరలు గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం మొదలయ్యే ఛాన్సుందని నిపుణులు అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: ఈ దేశాలకు షాకిచ్చిన ట్రంప్.. భారీగా సుంకాలు విధింపు..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News