Earthquake: భారీ భూకంపం.. ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:48 PM
Myanmar: ప్రకృతి విలయాల వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. వాటి వల్ల ధన, ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతుంది. అందుకే భూకంపాలు లాంటి ప్రకృతి విలయాల మాట వింటేనే అంతా హడలిపోతారు.

మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తాజా ప్రకటనలో వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు కంపించడం, ఒక బిల్డింగ్‌లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్‌లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలడానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మయన్మార్‌లో భూకంపాలు కొత్త కాదు. ఈ నెల ఆరంభంలో కూడా అక్కడ భూమి కంపించింది. ఆ టైమ్‌లో 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
చారిత్రక బ్రిడ్జ్ నేలమట్టం
మయన్మార్ భూకంప తీవ్రత భారీగా ఉంది. వరుస భూకంపాల వల్ల ఆ దేశంలోని పలు చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఓ భవనంలో 43 మంది గల్లంతు అయినట్లు సమాచారం. అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. భూకంపం ధాటికి మండాలేలోని చారిత్రక అవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలింది. మయన్మార్ వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. థాయ్‌లాండ్‌లోనూ భూకంపం సంభవించింది. బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో నగరంలోని భవనాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్, చైనాలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.
ఇవీ చదవండి:
సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం
పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి