Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:09 PM
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షడు తీసుకుంటున్న సుంకాల నిర్ణయాల కారణంగా అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పుడు ఇదే జాబితాలోకి ఇండియా కూడా చేరిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య పరస్పర సుంకాల విధింపు గురించి ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించనున్న వేళ కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అమెరికా, భారతదేశం మధ్య ఇప్పటివరకు వాణిజ్య సంబంధాలు సజావుగానే జరిగాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలపై (Reciprocal Tariffs) ఏప్రిల్ 2న ప్రకటన చేయనున్న నేపథ్యంలో అనేక చర్చలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా భారతదేశంతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో 2021-22 నుంచి 2023-24 వరకు, భారతదేశం అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఆ క్రమంలో వాణిజ్య వస్తువుల ఎగుమతి 18% ఉండగా, దిగుమతలు 6.22% వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. దీంతో పెరుగుతున్న అమెరికా వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు భారతీయ ఉత్పత్తులపై సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుంకాలు విధిస్తే ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆల్కహాల్, వైన్లు, స్పిరిట్స్
అమెరికాకు వస్తువుల ఎగుమతులలో ఆల్కహాల్, వైన్లు, స్పిరిట్స్ అనేవి ముఖ్యమైన రంగాలుగా ఉన్నాయి. ఈ రంగానికి ట్రంప్ పరస్పర సుంకాలను విధించినట్లయితే, సుమారు 122.10% వరకు సుంకం పెరిగే అవకాశం ఉంది. అయితే, భారతదేశం నుంచి ఎగుమతులు కేవలం $19.20 మిలియన్ల రూపాయిలలో ఉంటాయి, కాబట్టి ఈ పెరుగుదల ప్రభావం పరిమితంగా ఉంటుంది.
2. పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తుల ఎగుమతులు సుమారు $181.49 మిలియన్ల విలువ కలిగి ఉంటాయి. ఇవి 38.23% సుంకం పెంపు ద్వారా తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీనివల్ల నెయ్యి, వెన్న, పాలపొడి వంటి ఉత్పత్తుల ధరలు పెరిగి, వాటి మార్కెట్ వాటా తగ్గిపోతుంది.
3. చేపలు, మాంసం, సముద్ర ఆహారం
భారతదేశం నుంచి అమెరికాకు 2.58 బిలియన్ డాలర్ల సముద్ర ఆహారం, చేపలు, మాంసం ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ ఉత్పత్తులపై 27.83% సుంకం పెరిగితే, ముఖ్యంగా రొయ్యలు పోటీని ఎదుర్కొంటాయి. దీంతో ధరలు పెరిగి, నష్టాలు వచ్చే అవకాశముంది.
4. మాంసం ఉత్పత్తులు
భారతదేశం నుంచి జంతు మాంసం ఎగుమతుల విలువ $10.31 మిలియన్లు. ఈ రంగానికి కూడా 27.75% సుంకం పెరుగుదల విధిస్తే, ఉత్పత్తుల ధరలు పెరిగి, మార్కెట్ స్థితిపై ప్రభావం ఉంటుంది.
5. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, కోకో
ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, కోకో ఉత్పత్తులు $1.03 బిలియన్ల విలువ కలిగి ఉంటాయి. ఈ రంగానికి 24.99% సుంకం విధింపు ద్వారా భారతీయ స్నాక్స్, మిఠాయిల ధరలు కూడా పెరిగి, ఉత్పత్తులు పెరిగిన ధరలను ఎదుర్కొంటాయి.
6. పాదరక్షలు
పాదరక్షల రంగానికి 15.56% సుంకం పెరుగుదల వల్ల భారతదేశ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో సేల్స్ తగ్గిపోయే ఛాన్సుంది.
7. వజ్రాలు, బంగారం, వెండి
ఇదే సమయంలో భారతదేశం నుంచి 11.88 బిలియన్ డాలర్ల విలువ ఉన్న వజ్రాలు, బంగారం, వెండి ఎగుమతులు కూడా ప్రభావితమవుతాయి. ఈ రంగం 13.32% సుంకం పెరుగుదలతో భారతీయ ఆభరణాల ధరలు పెరిగి, పోటీ తగ్గుతుంది.
8. పారిశ్రామిక వస్తువులు
పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఔషధాలపై 10.90% సుంకం పెరుగుతుంది. దీంతో జనరిక్ మందులు, ప్రత్యేక ఔషధాల ధరలు పెరిగి, అమెరికా మార్కెట్లో కష్టాలు వచ్చే అవకాశముంది.
9. తినదగిన నూనెలు
కోబ్బరి, ఆవ నూనెలు వంటి తినదగిన నూనెలపై 10.67% సుంకం పెరుగుతుంది. దీనివల్ల ధరలు పెరిగి భారతీయ ఉత్పత్తుల పోటీ తగ్గుతుంది.
10. ఖనిజాలు, పెట్రోలియం, దుస్తులు
ఈ రంగాలలో కొత్త సుంకాలు వర్తించవు. ఈ రంగాలలో ఉత్పత్తుల ధరల పెరుగుదల జరగదు. కానీ అమెరికాలో ఎగుమతుల మార్పులు కొనసాగుతాయి.
పరస్పర వాణిజ్య ఒప్పందాలు
ఈ క్రమంలో ట్రంప్ ప్రధానంగా చుక్క, ముక్కపై ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ దీనిపై ఎలాంటి ప్రకటన చేస్తారోనని అనేక మందిలో ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
Stock Market Crash: స్టాక్ మార్కెట్లో 1,390 పాయింట్లు డౌన్.. గంటల్లోనే లక్షల కోట్ల నష్టం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News