Share News

AI: గ్రేట్ ఎస్కేప్.. సైబర్‌ మోసం నుంచి తప్పించుకున్న ప్రధాని

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:36 AM

Thailand PM: ఏఐతో అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా ఏఐని ఉపయోగించి మోసానికి తెరలేపారు. వీరు మోసం చేసింది సామాన్య వ్యక్తిని కాదండోయ్.. ఏకంగా ఓ దేశ ప్రధానినే మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రధానినే చెప్పడంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది.

AI: గ్రేట్ ఎస్కేప్.. సైబర్‌ మోసం నుంచి తప్పించుకున్న  ప్రధాని
Thailand PM Paetongtarn Shinawatra

సైబర్ నేరగాళ్ల వలలో పడటం.. మోసపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఏదో ఒక నెంబర్ నుంచి కాల్స్ రావడంతో వారు చెప్పిన విషయం విని గుడ్డిగా నమ్మి వారికి డబ్బులు వేయడం ఆ తరువాత మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడం అనేది పరిపాటిగా మారిపోతోంది. సామాన్యుల నుంచి పెద్దపెద్ద వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు ఎందరో. అయితే ఈ మధ్య కొత్త తరహా మోసానికి తెరతీశారు సైబర్ నేరగాళ్లు. ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్) అనేది ఎంత ప్రాముఖ్యతను పొందిందో అందరికీ తెలిసిందే. ఏ సమాచారం కోసమైనా ఏఐని ఉపయోగిస్తున్నారు.


ఏఐతో అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా ఏఐని ఉపయోగించి మోసానికి తెరలేపారు. వీరు మోసం చేసింది సామాన్య వ్యక్తిని కాదండోయ్.. ఏకంగా ఓ దేశ ప్రధానినే మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రధానినే చెప్పడంతో ఇప్పుడీ వార్త సంచలనంగా మారింది. ఇంతకీ ఏ దేశ ప్రధాని.. ఏ విధంగా సైబర్ నేరగాళ్లు మోసం చేయాలని ప్రయత్నించారో ఇప్పుడు చూద్దాం.


థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రా‌ను తమ ట్రాప్‌లో పడేలా చేసి.. డబ్బులు రాబట్టాలని ప్రయత్నించారు సైబర్ మోసగాళ్లు. అయితే ముందుగానే ఈ విషయాన్ని గ్రహించిన ప్రధాని.. వారి బారిన పడకుండా తనను తాను రక్షించుకున్నారు. ఏఐని ఉపయోగించి ఓ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి గొంతుతో థాయలాండ్‌ ప్రధానితో మాట్లాడి నమ్మబలికేందుకు యత్నించారు. అయితే ముందే గ్రహించిన ప్రధాని వారి నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని పేటోంగ్టార్న్‌ తెలియజేశారు. ఒక దేశ ప్రధాని అయిన తననే ఇలా చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏఐతో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయా అని విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఏ నేత పేరుతో ఫోన్ వచ్చిందనే విషయాన్ని మాత్రం ప్రధాని బయటపెట్టలేదు.


అసలేం జరిగిందంటే..

ముందుగా ఓ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యక్తి గొంతుతో ప్రధానికి ఫోన్ వచ్చింది. ‘‘‘ఎలా ఉన్నారు.. మీతో కలిసి పని చేయాలనుకుంటున్నా’’ అంటూ తొలుత వాయిస్ మెసేజ్ వచ్చిందని.. తిరిగి కాల్ చేయగా కట్ అయిపోయినట్లు తెలిపారు. మరోసారి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌లోని దేశాలలో థాయ్‌లాండ్‌ మాత్రమే విరాళం ఇవ్వలేదని.. తమకు వెంటనే విరాళాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మరో మెసేజ్ వచ్చిందని వెల్లడించారు. ఈ రకంగా మెసేజ్ రావడంతో తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. వెంటనే ఇది సైబర్‌ నేరగాళ్ల మోసమని గ్రహించానని.. ఈ ఫోన్‌ కాల్‌పై దర్యాప్తు కొనసాగుతోందని థాయిలాండ్ ప్రధాని తెలిపారు. అలాగే ఇలాంటి సైబర్ నేరగాళ్ల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని.. ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ వచ్చినా భయపడవద్దని..వారి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. వెంటనే పోలీసులను ఆశ్రయించి సమాచారం అందించాలని థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రా‌ సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనానికి డేట్ ఫిక్స్

బీసీసీఐ షాక్.. 10 పాయింట్లతో ప్రక్షాళన

Read Latest International News And Telugu News

Updated Date - Jan 17 , 2025 | 11:49 AM