Share News

America: అమెరికాలో దుండగుడి బీభత్సం.. 15కు చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Jan 02 , 2025 | 10:35 AM

లూసియానా: అమెరికాలోని న్యూ ఆర్లిన్స్‌లో ఓ దుండగుడు వాహనంతో సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 15కు చేరింది. న్యూ ఆర్లిన్స్‌లో ప్రజలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలో ఆకస్మాత్తుగా వచ్చిన ఓ దుండగుడు వాహనంతో జనంపైకి దూసుకుపోయాడు. అనంతరం కాల్పులు జరిపాడు.

America: అమెరికాలో దుండగుడి బీభత్సం.. 15కు చేరిన మృతుల సంఖ్య

లూసియానా: అమెరికా (America)లోని న్యూ ఆర్లిన్స్‌ (New Orleans)లో ఓ దుండగుడు వాహనంతో సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య 15కు చేరింది. న్యూ ఆర్లిన్స్‌లోని ఓ వీధిలో ప్రజలు కొత్త సంవత్సరం వేడుకలు (New Year Celebrations) జరుపుకుంటున్నారు. ఓ బార్ వెలుపల జనం గుమిగూడి ఉండగా దుండగుడు వాహనంతో (పికప్‌ ట్రక్‌) వారిపైకి దూసుకువెళ్లి ఆపై కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 30 మందికిపైగా గాయపడగా... వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. దుండగుడు టెక్సాస్‌కు చెందిన షంషుద్దీన్‌ జబ్బార్‌గా గుర్తించారు. అతను అమెరికా పౌరుడే. అయితే ఈ ఘటనపై ఉగ్రకోణం చర్యలో దర్యాప్తు చేసిన ఎఫ్‌బీఐ ఈ దాడి వెనుక మరికొంతమంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తోంది. దుండగుడి వాహనంలో ఐసీసీ ఉగ్రవాద జెండా లభించడంతో ఈ కోణంలో కూడా దర్యాప్తు సంస్థం గాలింపు చర్యలు ముమ్ము చేసింది. ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తెలిపారు. ప్రతి అంశాన్ని పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోడానికి వచ్చినవారు విగత జీవులుగా మారడంతో తన హృదయంబరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసను సహించేదు లేదని ఆయన స్పష్టం చేశారు.


కాసేపట్లో వేడుకలు ముగుస్తాయనగా..

లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లీన్స్‌లోని ఫ్రెంచ్‌ క్వార్టర్‌ బోర్బన్‌ స్ట్రీట్‌లో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త సంవత్సర వేడుకలు కాసేపట్లో ముగుస్తాయనగా.. ఓ బార్‌ వెలుపల జనాలు గుమిగూడారు. ఓ ఆగంతకుడు ఎస్‌యూవీ పికప్‌ ట్రక్కుతో వారిపైకి దూసుకెళ్లాడు. అనంతరం తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు దుండగుడిపై కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అప్పటికే పలువురు మృతి చెందగా.. దాదాపు 30 మందికి గాయాలయ్యాయి. ‘ఇది తీవ్రవాద దాడి కాదని భావిస్తున్నాం. ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు లభించాయి. వాటిని పరిశీలించాల్సి ఉంది’ అని ఎఫ్‌బీఐ పేర్కొంది. దాడి కారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగే స్టేడియాన్ని బుధవారం ఉదయం మూసివేశారు. గాయపడిన వారిని 5 ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారు. దాడి కారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగే స్టేడియాన్ని మూసివేశారు. గాయపడిన వారిని 5 ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి..

ప్రపంచ తెలుగు మహాసభల సమావేశాలకు సీఎం చంద్రబాబు

ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..

అనంతపురంలో భారీ అగ్ని ప్రమాదం.. బస్సులు దగ్ధం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 02 , 2025 | 10:39 AM