Share News

Donald Trump: మరో రికార్డును బద్దలు కొట్టనున్న ట్రంప్

ABN , Publish Date - Jan 19 , 2025 | 08:45 PM

Donald Trump: అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వరుస రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన సోమవారం దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Donald Trump: మరో రికార్డును బద్దలు కొట్టనున్న ట్రంప్
Donald Trump

వాషింగ్టన్, జనవరి 19: మరికొన్ని గంటల్లో అమెరికా నూతన దేశాధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్.. మరో రికార్డు బద్దలు కొట్టనున్నారు. జనవరి 20వ తేదీన యూఎస్ 47వ దేశాధ్యక్షుడిగా ఆయన క్యాపిటల్ రోటుండా లోపల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనున్నారు. అయితే గతంలో యూఎస్ దేశాధ్యక్షులుగా ఎన్నికైన వారు.. క్యాపిటల్ స్టెప్స్‌ వేదికగా ప్రమాణ స్వీకారం చేసే వారు. కానీ ట్రంప్ మాత్రం.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రం క్యాపిటల్ రోటుండా లోపల జరగనుంది.

ఈ కార్యక్రమం సోమవారం అంటే జనవరి 20వ తేదీన జరగనుంది. ఆ రోజు వాతావరణం అత్యంత శీతలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ వేదికను క్యాపిటల్ రోటుండా లోపల ఏర్పాటు చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం అంటే.. 1985లో నాటి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రోనాల్డ్ రీగన్ సైతం క్యాపిటల్ స్టెప్స్‌ మీద కాకుండా క్యాపిటల్ రోటుండా వేదికగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విధితమే. 40 ఏళ్ల అనంతరం డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం క్యాపిటల్ రోటుండాలో నిర్వహించనున్నారు.


జో బైడెన్‌తోపాటు బిల్ క్లింటన్..

ఇక ఈ కార్యక్రమానికి యూఎస్ ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్, సభలోని సభ్యులతోపాటు ఇతర ప్రముఖులు సైతం హాజరుకాన్నున్నారు. అలాగే మాజీ దేశాధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జార్జీ డబ్ల్యూ బుష్‌తోపాటు లౌరా బుష్, హిల్లరీ క్లింటన్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు.

Also Read : రోడ్డు ప్రమాదాలు.. 75 మందికి గాయాలు


సంగీత ప్రదర్శన..

అలాగే ఈ కార్యక్రమంలో.. సంగీత ప్రదర్శన సైతం ఉండనుందని మీడియాలో కథనాలు ప్రసారమవుతోన్నాయి. అమెరిక్‌ను మాజీ ఐడల్ విజేత క్యారీ అండర్‌వుడ్ ప్రదర్శన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ అత్యంత ఆప్తుడు లీ గ్రీన్ వుడ్ సైతం ఆదివారం అంటే జనవరి 19వ తేదీ నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలో ప్రదర్శన ఇవ్వనున్నారు. అదే విధంగా జనవరి 20వ తేదీ మధ్యాహ్నం ట్రంప్, జేడి వాన్స్‌ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది.

Also Read : ఎందుకు ఈ ముసుగులో మాటలు

Also Read: శుభలేఖలు పంచుతూ.. మృతు ఒడిలోకి..


జైశంకర్ సరే.. అంబానీ దంపతులు సైతం

ఇక యూఎస్ దేశాధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. అలాగే ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులతోపాటు ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతోపాటు నీతా అంబానీ హాజరుకానున్నారు. అయితే అమెరికాకు కాబోయే నూతన దేశాధ్యక్షుడితో ఈ దంపతులు ఇప్పటికే భేటీ అయినట్లు అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి.

Also Read : కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్

Also Read: తెలంగాణ ప్రజల త్యాగానికి అర్థం లేకుండా పోతుంది


ఇప్పటికే రికార్డు సృష్టించిన ట్రంప్

ఇంకోవైపు.. అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన జో బైడెన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో సైతం ట్రంప్ మళ్లీ తన సత్తా చాటారు. ఈ తరహాలో దేశాధ్యక్షుడిగా దాదాపు శాతాబ్దానికి క్రితం గ్రోవర్ క్లీవ్ లాండ్ సైతం ట్రంప్ తరహాలోనే రెండోసారి యూఎస్ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Also Read: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా


గతేడాది నవంబర్ 5వ తేదీన..

గతేడాది నవంబర్ 05వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన చేతిలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఒటమి పాలయ్యారు.

For International News And Telugu news

Updated Date - Jan 19 , 2025 | 08:45 PM