Egg Viral Video: గుడ్డు పెంకు ఈజీగా ఎలా తీశాడంటే.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా..
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:51 PM
Egg Viral Video:ఉడికించిన గుడ్డు రోజూ తింటే మంచిదని అందరికీ తెలుసు. కానీ, వీటి పెంకు తీయాలంటే ఒక పెద్ద యుద్ధమే చేస్తారు చాలామంది. ఇది చాలా ఈజీ అంటున్నాడు ఈ వ్యక్తి. లోపల గుడ్డుకి చిన్న గీత కూడా పడకుండా ఎగ్ షెల్ ఎలా తీయాలో ఇందులో చూపించారు..

Egg Viral Video: ప్రతి రోజూ గుడ్డు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. ఉడికించినవి అయితే ఆరోగ్యానికి మరీ మంచివని సూచిస్తుంటారు. అయినా గానీ చాలామంది ఎగ్ ఫ్రై లేదా ఆమ్లెట్ వేసుకునేందుకే ఇష్టపడతారు. ఇందుకు ముఖ్యకారణం ఇదే అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. గుడ్డు పెంకు తీయడం అంత సులభం కాదనే అభిప్రాయంతోనే గుడ్డు ఉడికించి తినేందుకు ఇష్టపడరంట. అందుకని ఇది పనే కాదని నిరూపించేందుకు ఒక నెటిజన్ గుడ్డు పెంకు ఈజీగా తీయడమెలాగో చూపించే ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది చూశాక ఇంత ఈజీనా.. ఇన్ని రోజులూ మాకూ తెలిదే అనుకోక మానరు.
గుడ్డును ఎంతసేపు ఉడికిస్తే త్వరగా పెంకు తీయడానికి వస్తుందో ఇప్పటికీ చాలామందికీ సందేహమే. ఎక్కువసేపు నీళ్లలో వేసి ఉడికిస్తే ఈజీగా వచ్చేస్తుందని కొందరు, కాదని మరికొందరు భ్రమపడుతుంటారు. చివరికి ఎంత జాగ్రత్తగా తీయాలని ప్రయత్నించినా గుడ్డు కాస్తాయినా చితికిపోతుంది. అలా కాకుండా కచ్చితంగా, ఈజీగా తీసే మార్గం గురించి ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ట్రిక్ పాటిస్తే ఇకనుంచి గుడ్డు పెంకు తీయడం కష్టమైన పని అననే అనరు.
గుడ్ల పెంకులు ఎంత సులభంగా తీయవచ్చో ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు ఓ నెటిజన్. ఇందులో ఓ మహిళ, గుడ్లతో పాటు మరిగే నీటిలో కట్ చేసిన నిమ్మకాయ ముక్కను జోడించింది. గుడ్లను కొంతసేపు ఉడకబెట్టిన తర్వాత వాటిని ఐస్ ముక్కలు ఉన్న నీటిలోకి వేసింది. అంతే ఆశ్చర్యకరంగా రెండు చేతులతో మధ్యలో పట్టుకుని అలా కదిలించింది. అంతే.. నీట్‌గా, వేగంగా గుడ్డు పెంకులు తొలగిపోయాయి. చాలా బాగుంది కదా. ఈ సూపర్-ఈజీ ట్రిక్ ఓ సారి మీరు ట్రై చేసి చూడండి.
Read Also: Pillow Covers: పిల్లో కవర్స్ ఎప్పుడు ఛేంజ్ చేస్తున్నారు.. ఎన్ని రోజుల తర్వాత మార్చాలో
Rat Control: ఎలుకల బాధతో విసిగిపోయారా.. ఇలా చేస్తే చంపకుండానే ఇంట్లో నుంచి
Life Style: ఈ చిట్కాలతో భార్య, భర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి