Share News

Food effects Mood: మీరు ఇష్టంగా తినే ఈ 6 రకాల పదార్థాలతో వల్ల మైండ్ పనిచేయదు..

ABN , Publish Date - Mar 31 , 2025 | 01:45 PM

How food affects mental health : మనం తినే ఆహారపదార్థాలకు మానసిక ఆరోగ్యానికి విడదీయలేని సంబంధం ఉంది. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది వాస్తవం. అందరూ ఇష్టంగా తినే ఈ 6 పదార్థాలే అనేక రకాల మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి.

Food effects Mood: మీరు ఇష్టంగా తినే ఈ 6 రకాల పదార్థాలతో వల్ల మైండ్ పనిచేయదు..
How diet impacts mental health

How food affects mental health : మీకు తెలియకుండానే క్షణాల్లో భావోద్వేగాల్లో మార్పులు వస్తున్నాయా.. కాసేపు సంతోషంగా అనిపించడం.. మరుసటి క్షణంలోనే మనసులో తెలియని బాధ, ఆందోళన, చిరాకు కలగడం ఎప్పుడైనా గమనించారా? ఆకస్మికంగా ఇలా మూడ్ మారుతూ ఉండటానికి కారణం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉంటేనే రావు. తినే లేదా తాగే పదార్థాలు కూడా మెంటల్ హెల్త్‌ను ప్రభావితం చేస్తాయి. మన మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆ 6 రకాల ఆహారపదార్థాలు, డ్రింక్స్ ఏవో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి..


1. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్

వైట్ బ్రెడ్, పాస్తా, బేకరీ ఉత్పత్తులు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు. ఇవి తిన్నప్పుడు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీని కారణంగా ఎంత త్వరగా శక్తి పెరిగిపోతుందో అంతే త్వరగా తగ్గిపోతుంది. ఇలా జరగడం వల్ల అలసట, చిరాకు వస్తుంది. వీటిని తరచూ తీసుకుంటే మానసిక ఆరోగ్య స్థితి బ్యాలెన్స్ తప్పుతుంది.


2. చక్కెర ఆహారాలు, పానీయాలు

అధిక చక్కెరగల పదార్థాలు తీసుకుంటే మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఎక్కువగా తీపి పదార్థాలు తిన్నప్పుడు లేదా తాగినప్పుడు రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పెరిగి ఎక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకు కూల్ డ్రింక్స్ తాగినపుడు వెంటనే ఎనర్జీ వచ్చిన భావన కలగటం సహజం. కానీ కాసేపయ్యాక గమనిస్తే చిరాకు, అలసట, నిరాశ కలిగినట్లు మీకు అనిపించవచ్చు.


3. ప్రాసెస్ ఫుడ్స్

ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్‌లోట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు, చక్కెర కంటెంట్ ఉంటాయి. ఇవి తిన్నప్పుడు వెంటనే మూడ్ ఛేంజ్ అయిపోతుంది. తరచుగా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ పెరుగుతాయి. ఇంకా, ఈ ఆహారాలు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి మానసిక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి.


4. అనారోగ్యకరమైన కొవ్వులు

పిజ్జా, బర్గర్లు,జంక్ ఫుడ్స్‌లో లభించే ట్రాన్స్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ అనారోగ్యకరమైన కొవ్వులు. ఇవి అటు శారీరక ఆరోగ్యాన్ని, ఇటు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. మీ మెదడు సరిగ్గా పనిచేయకపోవడానికి ఇవే కారణం. ఎక్కువగా తింటే తీవ్ర మానసిక సమస్యల ప్రమాదం తప్పదు.


5. కెఫిన్

కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు మీ శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. కానీ అంతే వేగంగా శక్తిని తగ్గించి అలసట, మూడ్ స్వింగ్స్‌కు కారణమవుతాయి. చిన్న విషయాలే భయం, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య సంబంధిత సమస్యలను వచ్చేలా చేస్తాయి.


6. మద్యం

అధికంగా మద్యం సేవించడం వల్ల మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొదట్లో మద్యం సేవించిన తర్వాత మీ మైండ్ రిలాక్స్ అయిన ఫీలింగ్ కలగవచ్చు. కానీ క్రమంగా మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. నిరాశ, ఆందోళన, చిరాకు, కోపం వంటివి ఒకేసారి ముంచుకొచ్చి మెదడు కంట్రోల్ తప్పుతుంది. అందుకే అధికంగా మద్యం సేవించడం శారీరక, మానసిక ఆరోగ్యాలకు హానికరం.


Read Also: Parenting Tips: పిల్లలకు 'నో' అని తెగేసి చెప్తున్నారా..బీ కేర్‌ఫుల్.. ఈ విషయం గనక

Deep Fried Foods: డీప్ ఫ్రై ఫుడ్స్ అంటే ఇష్టమా.. ఇలా చేసుకుని తిన్నా ఏం కాదంట..

Fridge Water: వేసవిలో అదేపనిగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఈ సమస్యల్లో ఇరుకున్నట్లే..

Updated Date - Mar 31 , 2025 | 01:58 PM