Flights Diverted: వర్షం ఎఫెక్ట్, 10 విమానాలు పక్క నగరానికి మళ్లింపు..వర్షకాలమైతే ఎలా అంటున్న నెటిజన్లు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 09:34 PM
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా 10 విమానాలను ఆకస్మాత్తుగా పక్క నగరమైన చెన్నైకి మళ్లించారు. ఇది ఎక్కడో కాదు. గ్రీన్ సిటీ బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. దీనిపై పలువురు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో వర్షాలు దంచికోడుతున్నాయి. ఈ వర్షాలు నగరంలోనే కాక, విమాన రాకపోకలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో వాతావరణం అనుకూలంగా లేదని 10 విమానాలను చెన్నైకి మళ్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో 10 విమానాలను చెన్నై విమానాశ్రయానికి మళ్లించినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో విషయాన్ని ప్రకటించింది. మేము వాతావరణాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తామని ప్రయాణికులకు తెలిపింది. ఈ క్రమంలో ప్రయాణికులు తాజా అప్‌డేట్లను తెలుసుకుంటారని ఆశిస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది.
ప్రయాణికులకు సూచనలు
ఈ క్రమంలో ప్రయాణికులు విమానాల పరిస్థితి గురించి తనిఖీ చేసుకోవాలని ఇండిగో సూచించింది. మీ ప్రయాణం రీషెడ్యూల్ చేయాలనుకుంటే, మీరు మా వెబ్‌సైట్ ద్వారా రీబుకింగ్ లేదా వాపసు ఎంపికలను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఇతర విమాన సంస్థలు తమ ప్రయాణికులకు రీషెడ్యూలింగ్, రీ బుకింగ్ లేదా టికెట్ వాపసు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానాల కార్యకలాపాలు సజావుగా కొనసాగిస్తామని ఆయా సంస్థలు తెలిపాయి.
విమానాశ్రయాలు, రోడ్లపై ప్రభావం
బెంగళూరులో భారీ వర్షపాతం కారణంగా విమానాశ్రయాలతోపాటు రోడ్లపై కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడింది. ప్రధానంగా హంసమారణహళ్లి ప్రాంతంలో నీరు నిలిచిపోవడం వలన విమానాశ్రయానికి వెళ్లే ప్రాంతం స్తంభించిపోయింది. ఇదే సమయంలో బెంగళూరులో ప్రధాన రోడ్లు కూడా నీటమునిగాయి. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ విషయం తెలిసిన పలువురు ప్రయాణికులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్షకాలం రాకముందే ఇలా ఇబ్బందులు ఏర్పడితే, ఇక వానాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వర్షం కారణంగా విమానాలు మళ్లించడం ఏంటి, ఈ పరిస్థితిని ముందే ఊహించి, ప్లాన్ చేయవచ్చు కాదా అని అంటున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. బారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా విమానాలు రద్దైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..
WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News