Road Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం. లారీ బోల్తాపడి ఏకంగా..
ABN , Publish Date - Jan 22 , 2025 | 09:58 AM
కర్ణాటక: కార్వార్‌లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. యల్లాపూర్ ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడి 10 మంది మృతిచెందగా.. 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

కర్ణాటక: కార్వార్(Karwar)లో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) సంభవించింది. యల్లాపూర్(Yallapur) ఘాట్ రోడ్డులో లారీ బోల్తాపడి 10 మంది మృతిచెందగా.. 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులంతా కూరగాయల వ్యాపారులుగా స్థానిక పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో లారీలో మెుత్తం 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే సమాచారాన్ని పోలీసులు, అంబులెన్స్‌కు అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Abhaya case : ‘అభయ’ మృత దేహంపై ఓ మహిళ డీఎన్‌ఏ!
కాగా, కర్ణాటక రాష్ట్రం సింధనూరు వద్ద మరో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు.. కర్ణాటక రాష్ట్రం హంపి క్షేత్రానికి తుపాన్ వాహనంలో బయలుదేరారు. అయితే సింధనూరు వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ కారు టైర్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో వేగంగా వెళ్తున్న వాహనం పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో హైవదన, అభిలాష, సుజేంద్ర అనే ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్రగాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనతో మంత్రాలయంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
సిఐడి మాజీ చీఫ్ అధికార దుర్వినియోగంపై విచారణ..
కర్ణాటక రోడ్డుప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందించారు. విద్యార్థులు, డ్రైవర్ మృతిపై వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AP Politics: వైసీపీ కుట్రలకు చెక్.. కూటమి నేతల విజయం..
Hero Darshan: హీరో దర్శన్ తుపాకీ లైసెన్స్ రద్దు