Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
ABN , Publish Date - Mar 21 , 2025 | 09:14 PM
కొత్త వేతనాల ప్రకారం ముఖ్యమంత్రి వేతనం రూ.75,000 నుంచి 1.5 లక్షలకు చేరింది. మంత్రుల వేతనం 108 శాతం పెరిగి రూ.60,000 నుంచి రూ.1.25 లక్షలకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు అందరికీ 100 శాతం జీతాలు పెరిగాయి. ఈ మేరకు ఒక బిల్లును కర్ణాటక అసెంబ్లీ శుక్రవారంనాడు ఆమోదించింది. దీంతో ఏటా రాష్ట్ర ఖజానాపై రూ.62 కోట్ల అదనపు భారం పడనుంది. కొత్త వేతనాల ప్రకారం ముఖ్యమంత్రి వేతనం రూ.75,000 నుంచి 1.5 లక్షలకు చేరింది. మంత్రుల వేతనం 108 శాతం పెరిగి రూ.60,000 నుంచి రూ.1.25 లక్షలకు చేరింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది. వారి పెన్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు.
Karnataka: కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం
కర్ణాటక మినిస్టర్స్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ (అమెండమెంట్) బిల్లు, కర్ణాటక లెజిస్లేచర్ సేలరీస్, పెన్షన్స్ అండ్ అరవెన్సెస్ (అమెండమెంట్) బిల్లును శుక్రవారంనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై ఎలాంటి చర్చా లేకుండానే సభ ఆమోదించింది. ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం కోటా రిజర్వేషన్‌పై సభలో విపక్షాలు ఆందోళనల మధ్య వేతనాల పెంపు బిల్లులు సభామోదం పొందాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సహాయ మంత్రులు, ఉప ముఖ్యమంత్రుల వేతనాలు చాలాకాలంగా సవరించలేదని, ఆ కారణంగా గణనీయంగా వారి వేతనాలు పెంచాలని నిర్ణయించినట్టు బిల్లు పేర్కొంది. సవరించిన వేతనాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్‌పర్సన్ వేతనం రూ.75,000 నుచి 1.25 లక్షలకు పెరిగింది.
ఇవి కూడా చదవండి
MK Stalin: ఎంపీల సంఖ్యతో పాటు రాష్ట్ర హక్కులకు భంగం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్
10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు
Judge Corruption: హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. అవాక్కైన ఫైర్ సిబ్బంది.. ఏం జరిగిందంటే
Read Latest National News And Telugu News