Chennai: 10వ శతాబ్దం నాటి శాసనం లభ్యం
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:09 AM
పుదుకోట(Pudukota) జిల్లా ఇల్లూపూర్ తాలూకా పిలిప్పట్టి గ్రామంలో చోళుల కాలం నాటి శిలాశాసనం బయల్పడింది. మూడు వైపులా తమిళంలో అక్షరాలున్న శాసనాన్ని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించినట్లు పురావస్తుశాఖ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు.
చెన్నై: పుదుకోట(Pudukota) జిల్లా ఇల్లూపూర్ తాలూకా పిలిప్పట్టి గ్రామంలో చోళుల కాలం నాటి శిలాశాసనం బయల్పడింది. మూడు వైపులా తమిళంలో అక్షరాలున్న శాసనాన్ని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించినట్లు పురావస్తుశాఖ డైరెక్టరేట్ అధికారులు తెలిపారు. ఇది 10వ శతాబ్దానికి చెందినదని వారు వివరించారు. ఇది కొడుంబలూరుకు చెందిన ఐనుర్రువర్లు, సాలియర్, మువాయిరట్టు ఐనుర్రువర్లు, ఎరివీరపట్టినానికి చెందిన వ్యాపార సంఘాలను ప్రస్తావిస్తోంది.
ఈ వార్తను కూడా చదవండి: Pongal: పొంగల్ టోకెన్ల పంపిణీ ప్రారంభం
మదురై, పూంగుండ్రం, పురమలై, మనలూర్‌నాడు(Madurai, Poongundram, Puramalai, Manalur Nadu)లోని వివిధ ప్రాంతాల నుంచి వర్తక సమూహాలు వచ్చినట్లు ఈ శిలాశాసనం చెబుతోంది. ఈ శాసనం చోళ రాజైన కొప్పరకేసరి కాలంనాటిదని పురావస్తుశాఖాధికారులు పేర్కొన్నారు. ఈ శాసనంపై ఆయుధాల చిహ్నాలు, త్రిశూలం, కొడవలి, కత్తి, రాజగొడుగు వంటి ఉపకరణాలు కూడా చెక్కబడి వుండడం విశేషం.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News