Share News

Maharashtra CM: సీఎం సమక్షంలో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

ABN , Publish Date - Jan 01 , 2025 | 06:29 PM

Maharashtra CM: మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతమంటేనే మావోయిస్టుల అడ్డ. అలాంటి అడ్డాలో మావోయిస్టులకు బుధవారం చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

Maharashtra CM: సీఎం సమక్షంలో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు
Maoists

ముంబయి, జనవరి 01: దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకొంది. ఆ క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ముందుకు వెళ్తుంది. అలాంటి వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బుధవారం గడ్చిరోలి జిల్లాలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్షంలో ఈ మావోయిస్టులు లొంగిపోయారు. అయితే లోంగిపోయిన వారిలో.. తారక్క అలియాస్ విమల సైతం ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క. 1983లో నక్సలిజం వైపు ఆకర్షితురాలై.. విమల ఉద్యమంలోకి అడుగు పెట్టింది. మల్లోజుల కిషన్ జీ సోదరుడే మల్లోజుల వేణుగోపాల్. అతడి భార్య తారక్క.

గడ్చిరోలిలో గతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేదని.. అలాంటి ప్రాంతంలో పోలీసులు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారన్నారు. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్చిరోలి ప్రాంతాన్ని చత్తీస్‌గఢ్‌‌తో అనుసంధానం చేస్తూ.. రహదారిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అలాగే మొబైల్ టవర్లు సైతం నిర్మిస్తున్నారని గుర్తు చేశారు.

ఇక మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు.. ఇటీవల నాగపూర్‌లో ముగిశాయి. ఈ సమావేశాల్లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. గత ఏడాది 33 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో మరణించారని చెప్పారు. ఇక గడ్చిరోలి జిల్లా ఉత్తర భాగం పూర్తిగా మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వివరించారు. అలాగే 55 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా.. 33 మంది లొంగిపోయారని తెలిపారు.


Maharashtra CM Devendra Fadnavis.jpg

మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు మూడేళ్ల కాలపరిమి విధించుకున్నామని ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేశారు. మరోవైపు గడ్చిరోలి ప్రాంతానికి చెందిన వందలాది యువత పోలీస్ శాఖలో చేరారన్నారు. వారిలో 33 మంది యువకులు మావోయిస్టులు బాధితులు ఉన్నారని వివరించారు. ఇక మావోయిస్టుల అగ్రనేతలు సైతం లొంగి పోయి జనజీవన స్రవంతిలో కలిశారన్నారు.

Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి


2026, మార్చి మాసాంతం నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. అందుకోసం తనదైన శైలిలో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం భాగా తగ్గిపోయింది. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాలు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వారి ప్రాబల్యం దాదాపుగా తుడిచి పెట్టుకుపోయింది.

Also Read: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఎందుకంటే..

Also Read: పోలీస్ విచారణకు హాజరైన పేర్ని జయసుధ


ఇక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రాబల్యం కొంత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో సైతం భద్రత దళాలు, స్థానిక పోలీసుల సహయంలో కూబింగ్ తీవ్రతరం చేసింది.అందులోభాగంగా పలు ఎన్‌కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి.

Also Read: భద్రత బలగాలకు తప్పిన ముప్పు.. 57 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి

Also Read: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం


ఈ ఎన్‌కౌంటర్లలో దాదాపు 27 మంది అగ్రనేతలు మరణించిన విషయం విధితమే. ఇక దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం .. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక సూచనలు చేస్తున్నారు.

For National News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 08:34 PM