Air India Reaction: క్రికెటర్ డేవిడ్ వార్నర్ సీరియస్.. ఎయిర్ ఇండియా రియాక్షన్ ఇదే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:47 PM
క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్స్ పోస్టుపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఫ్లైట్ ఆలస్యం కావడానికి కారణాన్ని తెలుపుతూ వివరణ ఇచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత విమానయాన సంస్థ 'ఎయిర్ ఇండియా'ఫ్లైట్ ఆలస్యంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశారు. పైలట్ లేకుండా విమానంలో తాము గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని, విమానానికి పైలట్లు లేరని తెలిసి కూడా ప్రయాణీకులను ఎందుకు ఎక్కిస్తారని వార్నర్ తన 'ఎక్స్' ఖాతా ద్వారా ఎయిర్ ఇండియాను ప్రశ్నించారు.
అయితే, వార్నర్ పోస్ట్ మీద ఎయిర్ ఇండియా స్పందించింది. బెంగళూరులో ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఫ్లైట్ ఆలస్యం కావడానికి కారణమని పేర్కొంది. వాతావరణం అనుకూలించకపోవడంతో అనేక విమానయాన సంస్థలు తమ ఫ్లైట్స్ దారి మళ్లింపు లేదా ఆలస్యంగా టేకాఫ్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఫలితంగా సిబ్బంది విధుల్లోనూ అంతరాయాలు నెలకొన్నాయని వివరణ ఇచ్చింది.
ఫ్లైట్ ఆలస్యమైనా మీతోపాటు ఇతర ప్రయాణీకులు చూపిన ఓర్పునకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెబుతూ కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిసింది. అదే సమయంలో ప్రయాణానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ను ఎంచుకున్నందుకు వార్నర్‌కు ధన్యవాదాలు చెప్పింది ఎయిర్ ఇండియా.
ఇదిలా ఉండగా, నితిన్ హీరోగా నటించిన 'రాబిన్‌హుడ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ విచ్చేసిన వార్నర్‌కు చిత్రబృందం సాదర స్వాగతం పలికింది. సాయంత్రం జరగనున్న 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వార్నర్ పాల్గొంటారు.సదరు సినిమాలో యాక్ట్ చేయడంపై ఆయన మాట్లాడనున్నారు. సినిమా విశేషాలను పంచుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి: