Share News

Pawan Kalyan: దేశాన్ని ముక్కలు చేస్తారా.. స్టాలిన్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Mar 15 , 2025 | 07:38 AM

తమిళనాడు సీఎం స్టాలిన్ ఓవైపు హిందీ వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్..స్టాలిన్ వైఖరిపై నిన్న జనసేన ఆవిర్భావ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Pawan Kalyan: దేశాన్ని ముక్కలు చేస్తారా.. స్టాలిన్‌కు గట్టిగా ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan Counter Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) గత కొంత కాలంగా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో హిందీ భాషను విస్తరించడం అన్యాయమని, దక్షిణ భారతదేశానికి ఈ భాష హాని చేసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో స్టాలిన్ ఈ ఉద్యమాన్ని మరింత పెంచుతూ ఇటీవల, వారి రాష్ట్ర బడ్జెట్ సమయంలో కూడా హిందీలో ఉన్న రూపాయి లోగోను.. తమిళ భాషలోకి మార్పు చేశారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ అంశంపై నిన్న స్పందించారు.


సినిమాలు హిందీలోకి ఎందుకు

ఈ క్రమంలో హిందీ భాషను వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం, వారి సినిమాలను కూడా హిందీలోకి అనువదించవద్దన్నారు. హిందీ వాళ్ల డబ్బులైతే కావాలి, కానీ ఆ భాష విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయవద్దని స్టాలిన్‎కు పవన్ హితవు పలికారు. తమిళనాడులో ఒక్క భాష విధానం..భాషా సంక్షేమం అనేది ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. కానీ మిగతా భారతదేశంలో బహుభాషా విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పవన్ స్పష్టంగా చెప్పారు.


అభివృద్ధి సాధనానికి..

పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ భాష మన తత్వానికి, వ్యక్తిత్వానికి ప్రతీక. మన భాషను పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ క్రమంలో బహుభాషా విధానం కూడా ఒక విధంగా అభివృద్ధి సాధనానికి దారి తీస్తుందన్నారు. మన మాతృభాష తోపాటు, మరో భాష నేర్చుకుంటే, అది ఏ మాత్రం మనకు నష్టాన్ని కలిగించదని పవన్ అన్నారు. ఈ క్రమంలో ఆ భాష ఉన్న ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.


సీఎం స్టాలిన్

హిందీ వ్యతిరేక ఉద్యమం క్రమంగా దేశ విభజనకు దారితీస్తుందన్నారు పవన్. ఇది రాజకీయ వైరుధ్యాలుగా పెంచుతుందని చెప్పారు. దీనివల్ల దేశంలో హిందీ, తెలుగు, తమిళ భాషలు మాట్లాడే ప్రజల మధ్య తేడాలు పెరిగి, నెమ్మదిగా వేరే భాగాలు అయిపోయే అవకాశం ఉందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‎కు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం హిందీ భాషా విధానంపై మరింత చర్చను పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి మరి.


ఇవి కూడా చదవండి:

Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 15 , 2025 | 08:33 AM