RSS: ఇప్పటి తరానికి ఆ అవసరం లేదు.. ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:55 PM
నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు.

నాగపూర్: మహారాష్ట్రలో మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ సమాధి వివాదం ముదురుతోంది. నాగపూర్‌లో కొందరు అల్లరిమూకలు శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక వర్గం ఆస్తులపై తెగబడటం, పలు వాహనాలకు నిప్పుపెట్టడం తీవ్ర ఉద్రికతలు దారితీసింది. ఈ ఘటనలో 35 మందికి పైగా గాయపడగా, వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉండటంతో దీనిని మహారాష్ట్ర సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. హింసాకాండకు ప్రేరేపించినట్టుగా భావిస్తున్న స్థానిక నేత షాహిమ్ ఖాన్‌తో సహా 50 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కీలక వ్యాఖ్యలు చేసింది. ఔరంగజేబు సమాధి నేటి తరానికి అవసరం లేదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని అన్నారు.
PM Modi: మోదీని మళ్లీ ప్రశంసించిన కాంగ్రెస్ సీనియర్ నేత
"అసలు ప్రశ్న ఏమిటంటే... ఇవాల్టి తరానికి ఔరంగబేబు అవసరమా? ఆయన సమాధి తొలగించవచ్చా? సమాధానం ఒక్కటే..ఔరంగజేబు ఈ తరానికి అవసరం లేదు" అని సునీల్ అంబేకర్ అన్నారు. ఏవిధమైన హింస సమాజానికి మంచిది కాదని హెచ్చరించారు. శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా ఇటీవల విడుదల 'ఛావా' సినిమా తర్వాత మహారాష్ట్రలో భావోద్వేగాలు తీవ్రమయ్యాయి. శంభాజీని ఔరంగజేబు చంపిన విధానం ప్రధానంగా ఈ భావోద్వేగాలకు కారణమవుతోంది. ఖుల్దాబాద్‌లోని ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో పవిత్ర వ్యాఖ్యలున్న ఒక వస్త్రాన్ని దహనం చేశారనే వదంతులు వ్యాప్తి చెందడంతో నాగపూర్‌లోని పలు చోట్ల ఒక వర్గం వారు హింసాకాండకు దిగారు. ఇది పక్కా ప్లానింగ్‌తో చేపట్టిన కుట్రగా మహారాష్ట్ర సర్కార్ అనుమానిస్తోంది.
ఇవి కూడా చదవండి
Aurangzeb tomb row: ఒసామాబిన్ లాడెన్ ప్రస్తావన చేసిన ఏక్‌నాథ్ షిండే
PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
Ranya Rao: సినిమాలు వదిలేసి.. దుబాయికు రన్యారావు.. ఈ ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి