Bangladesh: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
ABN , Publish Date - Jan 12 , 2025 | 07:50 PM
ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: సరిహద్దు ఉద్రిక్తతలపై భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ (Bangladesh) విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు సమన్లు పంపింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు విదేశాంగ కార్యాలయానికి వెళ్తూ ప్రణయ్ వర్మ కనిపించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి జషిమ్ ఉద్దీన్‌తో ఆయన సుమారు 45 నిమిషాలు మాట్లాడారు. వర్మకు సమన్లు పంపిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండో-బంగ్లా సరిహద్దుల వెంబడి ఐదు చోట్ల ఫెన్సింగ్ నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోందని బంగ్లాదేశ్ ఇంతకుముందు ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
Delhi Elections 2025: బీజేపీ పెద్ద పొరపాటు చేసింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైర్
బంగ్లా విదేశాంగ కార్యదర్శితో సమావేశానంతరం వర్మ మాట్లాడుతూ, భద్రత పరంగా సరిహద్దుల వెంబడి కంచె వేసే విషయమై ఢాకా-న్యూఢిల్లీ మధ్య అవగాహన ఉందని చెప్పారు. "ఇందుకు సంబంధించి ఇరు దేశాల సరిహద్దు కాపలా సంస్థలు బీఎస్ఎఫ్, బీజీబీ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్) ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నాయి. ఆ అవగాహనను అమలు చేస్తారని, సరిహద్దుల వెంబడి నేరాలపై పోరాటానికి పరస్పరసహకార విధానం పాటిస్తారని ఆశిస్తున్నాం'' అని తెలిపారు.
బంగ్లా ఆరోపణ ఏంటి?
కాగా, దీనికి ముందు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతపై హోం శాఖ వ్యవహారాల సలహాదారులు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్, స్థానికుల ప్రతిఘటనతో సరిహద్దుల వెంబడి బార్డ్ వైర్ ఫెన్సింగ్ నిర్మాణాన్ని భారత్ నిలిపేసిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సమానత్వం కొరవడిన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఆ కారణంగానే బంగ్లాదేశ్-ఇండియా సరిహద్దుల వెంబడి పలు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్‌తో 4,156 కిలోమీటర్ల సరిహద్దులో 3,271 కిలోమీటర్లకు భారత్ ఇప్పటికే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుందని, మరో 885 కిలోమీటర్లకు ఫెన్సింగ్ లేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Hero Vijay: హీరో విజయ్ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
Chief Minister: నాన్న అనే ఆ పిలుపే మా పాలనకు కితాబు
Read Latest National News and Telugu News