Share News

Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - Mar 31 , 2025 | 04:41 PM

Ranya Rao: విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన రన్యారావు కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. ఈ కేసులో ఏ3గా ఉన్న సాహెల్ చెప్పిన వివరాలను డీఆర్ఐ అధికారులు రికార్డు చేశారు. ఈ విచారణలో సాహెల్ పలు కీలక విషయాలను బహిర్గతం చేశారు.

Ranya Rao: వెలుగులోకి సంచలన విషయాలు..
Ranya Rao

బెంగళూరు, మార్చి 31: బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో అరెస్టయిన రన్యారావు పేరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) జరుపుతోన్న విచారణలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో రన్యా రావు 14.56 కిలోల చైనీస్ గంజాయిని అక్రమంగా రవాణా చేసినట్లు ఇటీవల వెల్లడైంది. అలాగే ఈ రన్యా రావు కేసులో మూడో నిందితుడు సాహిల్‌ను విచారించగా.. దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకు వచ్చిన బంగారాన్ని విక్రయించడంలో తాను సహాయం చేసినట్లు ఒప్పుకున్నాడు.

జనవరి 11వ తేదీ మాత్రమే కాకుండా గతంలో సైతం చాలా సందర్భాల్లో బంగారాన్ని అక్రమంగా రవాణా చేశానని సాహిల్ ఈ సందర్భంగా విచారణలో స్పష్టం చేశాడు. అలాగే డీఆర్‌ఐ అధికారులు పొందిన డిజిటల్ ఆధారాల్లో బంగారం అక్రమ రవాణా రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే విధంగా సాహిల్ జైన్.. తన వాట్సాప్ చాట్ ద్వారా దుబాయ్‌కి నగదు బదిలీ చేసినట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ విధంగా వాట్సాప్ చాట్ ద్వారా స్మగ్లింగ్ బంగారం విక్రయం వెలుగులోకి వచ్చింది. ఇక చిన్నా అక్రమంగా రవాణా చేసిన వస్తువులను విక్రయించడానికి సహాయం చేశాడని ఇదే చాట్ ద్వారా వెల్లడైంది. మార్చి 3న రన్యా రావు దుబాయ్ నంబర్ నుండి సాహిల్‌కు కాల్ చేసి చిన్నాతో బంగారం చేరవేయడంపై చర్చించినట్లు తేలింది.


అలాగే హవాలా కుంభకోణంలో తాను సైతం పాల్గొన్నానని సాహిల్ పేర్కొన్నాడు. దుబాయ్‌లో బంగారం కొనడానికి రన్యా రావుకు హవాలా ద్వారా నగదు చెల్లించడంపై కూడా ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. డిఆర్ఐ ఆధ్వర్యంలో సాహిల్‌ను విచారిస్తున్న సంగతి తెలిసిందే.


బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నటి రన్యా రావు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు రన్యా రావుకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. దీంతో నటి రన్యా రావు బెంగళూరులోని పరప్పన అగ్రహారంలో మరిన్ని రోజులు ఉండనున్నారు. అయితే మళ్లీ బెయిల్ కోసం రన్యారావు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని సైతం కోర్టు తిరస్కరించింది.


నటి రన్యా రావుపై బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి బెయిల్‌ దరఖాస్తును 64వ సెషన్స్ కోర్టు జడ్జి ఐ పీ నాయక్ తిరస్కరించారు. రన్యా బెయిల్ దరఖాస్తును మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించిన తర్వాత.. ఆమె సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. రన్యా తరపున సీనియర్ న్యాయవాది కిరణ్.. తన వాదనలు వినిపించారు. తన బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురైన తర్వాత రన్యా రావు హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.


మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్‌కు కొట్టివేయడనికి గల కారణాలు సైతం సర్వత్ర వినిపిస్తున్నాయి. రన్యారావు కేసులో అంతర్జాతీయ లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే బంగారం అక్రమ స్మగ్లింగ్ ద్వారా కస్టమ్స్ ఉల్లంఘన జరిగింది. ఆమె కనుక జైలు నుంచి బయటకు వస్తే.. సాక్ష్యాలను నాశనం చేసి.. ఈ కేసును పక్క దారి పట్టించే అవకాశముందనే డీఆర్ఐ తరఫు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేసింది.


గతేడాది 27 సార్లు రన్యారావు విదేశాలకు వెళ్లి వచ్చింది. అంతే కాకుండా బంగారం స్మగ్లింగ్ ద్వారా 38 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది. దీని మొత్తం విలువ రూ. 4, 83, 72, 694 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది పన్ను మోసం. అలాగే ఓ వేళ రన్యా రావుకు బెయిల్ మంజూరు చేస్తే.. ఆమె దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతోంది. అంతేకాకుండా సాక్ష్యులను సైతం ప్రభావితం చేస్తారనే అంటున్నారు.


ఉదయం దుబాయి వెళ్లి.. సాయంత్రానికి బెంగళూరుకు ప్రముఖ నటి రన్యా రావు తిరిగి వస్తున్నారు. ఇలా పలుమార్లు జరగడంతో ఆమెపై డీఆర్ఐ అధికారులకు రన్యారావు భర్త ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రన్యారావును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు సంచలన విషయాలను ఆమె నుంచి రాబట్టిన విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

Also Read: తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీనిలోని పోషకాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..

Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 04:59 PM