BJP: సీనియర్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
ABN , Publish Date - Mar 26 , 2025 | 06:53 PM
పార్టీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నామని పేర్కొంటూ పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ అధికారికంగా బసనగౌడ పాటిల్ యత్నాల్‌కు ఒక లేఖలో తెలియజేసింది.

బెంగళూరు: కొద్దికాలంగా వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రముఖంగా వినిపిస్తున్న కర్ణాటక బీజేపీ సీనియర్ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ (Basanaguda Patil Yatnal)పై ఆ పార్టీ బుధవారంనాడు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.
PM Modi: రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ
పార్టీ పలుమార్లు హెచ్చరించినప్పటికీ వైఖరి మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నామని పేర్కొంటూ పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ అధికారికంగా బసనగౌడ పాటిల్ యత్నాల్‌కు ఒక లేఖలో తెలియజేసింది.
వివాదాలకు కేరాఫ్
బసవగౌడ పాటిల్ యత్నాల్ కొద్దికాలంగా పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రపై కూడా ఆయన కయ్యానికి కాలుదువ్వారు. విజయేంద్ర అవినీతి, ఎడ్జెట్‌మెంట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. దీనిపై గత ఫిబ్రవరిలో కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. తాజాగా దీనిపై చర్య తీసుకుంటూ ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. యత్నాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా అంతర్గత క్రమశిక్షణకు పార్టీ కట్టుబడి ఉంటుందని బీజేపీ సంకేతాలు ఇచ్చింది. యత్నాలు తొలగింపుతో కర్ణాటక రాజకీయాలపై ముఖ్యంగా ఆయనకు మంచిపేరున్న విజయపురలో పార్టీపై ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. పార్టీ నిర్ణయంతో ఆయన రాజకీయ ప్రత్యామ్నాయం వెతుక్కుంటారా అనేది వేచిచూడాలి.
ఇవి కూడా చదవండి..