Viral Video: పట్టపగలే బీజేపీ నేత దారుణ హత్య.. కారణమిదే..
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:22 PM
ఓ వ్యక్తి తన అత్త భూమిని కొనుగోలు చేశాడని అతనిపై కక్ష్య గట్టాడు. ఆ క్రమంలోనే వారిద్దరికీ మాటా మాట పెరిగి గొడవ పడే స్థాయికి చేరింది. చివరకు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశాడు.

ఓ భూ వివాదం కారణంగా బీజేపీ మండల అధ్యక్షుడు సురేంద్ర జవహర్‌ను.. ప్రత్యర్థి పట్టపగలే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఓ షాపింగ్ మాల్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హర్యానా(Haryana) సోనిపట్ జిల్లాలో జరిగిన ఈ హత్యకేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భూ వివాదం, రక్తపాతం
నిందితుడు, బీజేపీ నేత సురేంద్ర జవహర్ మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సురేంద్ర జవహర్.. తన పొరుగువారి అత్త భూమిని కొనుగోలు చేయడంతో అసలు లొల్లి మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే చాలా రోజులుగా వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. అవి కాస్తా ఇప్పుడు హత్య చేసుకునే వరకు వెళ్లాయి.
దుకాణంలోకి చొరబడి కాల్పులు
శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుడు ముందుగా బీజేపీ నేతకు వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొంతసేపటి తరువాత జవహర్ తన దుకాణంలో కూర్చుని ఉండగా, నిందితుడు తుపాకీతో లోనికి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అతని తలపై వరుసగా మూడు బుల్లెట్లు దింపాడు. దీంతో జవహర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సీసీటీవీ ఫుటేజ్ బయటకు.. పోలీసులు రంగంలోకి
ఈ ఘోరమైన ఘటన షాపింగ్ మాల్‌లో జరిగిన కారణంగా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో పూర్తిగా రికార్డ్ అయ్యింది. వీడియో ఫుటేజ్‌లో నిందితుడు ఎలా దాడి చేశాడో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.
గతంలోనూ ఘర్షణలు.. చివరకు హత్య
సురేంద్ర జవహర్, నిందితుడి మధ్య గతంలో కూడా ఎన్నోసార్లు వాగ్వాదాలు జరిగాయి. ఆ భూమి విషయంలో అనేక సార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జవహర్ తన పొలం వద్ద విత్తనాలు నాటేందుకు వెళ్లిన సమయంలో మరోసారి వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, కాసేపటి తర్వాత నిందితుడు బీజేపీ నేతను అతి కిరాతకంగా హత్య చేయడం సంచలనంగా మారింది.
ఈ ఘటనపై పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భూ వివాదమే అసలు కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాన్ని కూడా పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Viral News: తాగలేదు, ఎయిర్‌బ్యాగ్స్ వల్లే ప్రమాదమన్న యువకుడు..నిజమేనా..
ISIS Global Chief: ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ హతం..ట్రంప్ పనేనా..
Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం..41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..
Pawan Kalyan: తమిళనాడు సీఎంకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలు..
Read More Business News and Latest Telugu News