Share News

Kisan Credit Cards: రైతులకు గుడ్ న్యూస్.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితి పెంపు

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:54 AM

రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.

 Kisan Credit Cards: రైతులకు గుడ్ న్యూస్.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితి పెంపు
Kisan Credit Card

Kisan Credit Card: బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలిచ్చే కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రుణ పరిమితిని పెంచింది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. దీంతో దాదాపు 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.

1998లో ప్రవేశపెట్టిన కిసాన్‌ క్రెడిట్‌ స్కీమ్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు లబ్ధి చెందుతుంది. అయితే, ఈ కార్డుల పరిమితి చాలా కాలంగా సవరించలేదు. ఈ పథకం కింద రైతులు 9 శాతం వడ్డీ రేటుతో రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వం 2 శాతం వడ్డీ రాయితీగా అందిస్తుంది. అదనంగా, రైతులు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించినట్లయితే, రైతులు మరో 3 శాతం వరకు వడ్డీ రాయితీని పొందుతారు. తద్వారా వడ్డీ రేటును కేవలం 4 శాతానికి తగ్గించవచ్చు.

Updated Date - Feb 01 , 2025 | 12:15 PM