Share News

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:54 AM

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. దీంతో 20 ఏళ్ల వైవాహిక జీవితానికి అతడు ముగింపు పలకబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Virender Sehwag And Aarti

Virender Sehwag And Arti Divorce Rumours: ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడాకుల నిర్ణయం తీసుకుంటే ముందుగా సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం ఆనవాయితీగా మారింది. ఇక వారు అలా చేయడం ఆలస్యం నెటిజన్లు వారికి విడాకులు అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తారు.

తాజాగా, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరూ తమ 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2004లో పెళ్లి చేసుకున్న సెహ్వాగ్, ఆర్తి చాలా నెలలుగా విడివిడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.


సాధారణంగా తన కుటుంబం గురించి చాలా ఓపెన్‌గా ఉండే సెహ్వాగ్, గత ఏడాది దీపావళి వేడుక సందర్భంగా సోషల్ మీడియాలో తన పెద్ద కొడుకు ఆర్యవీర్, అతని తల్లి కృష్ణతో ఉన్న ఫోటోలను మాత్రమే పంచుకున్నాడు.. కానీ, అతని భార్య ఆర్తి, చిన్న కొడుకు వేదాంత్ చిత్రాలను పోస్ట్ చేయలేదు. దీంతో వీరు విడిపోవడానికి సిద్దం అయ్యారని టాక్ వినిపించింది. తాజాగా, సెహ్వాగ్ ఆర్తీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకులు గ్యారెంటీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


ఇన్‌స్టాగ్రామ్‌లో 178k ఫాలోవర్లు ఉన్న ఆర్తి, వారి విడాకుల గురించి వైరల్ కావడంతో అకస్మాత్తుగా తన ప్రొఫైల్‌ను ప్రైవేట్‌లో పెట్టింది. సెహ్వాగ్ తన భార్యతో ఉన్న ఫొటోలను ఇంకా తీసివేయనప్పటికీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్తితో చివరిగా తన 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 22,2024న పోస్ట్ చేసింది కనిపిస్తోంది. అయితే, చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా ఉన్న వీరు 20వ సంవత్సరాల తర్వాత విడిపోతున్నారని వార్త రావడంతో అతడి అభిమానలు ఆందోళన చెందుతున్నారు.

Also Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్.. వీడియో మామూలుగా లేదుగా..

Updated Date - Jan 24 , 2025 | 12:33 PM